వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరుచివున్న డోర్: గాలిలోనే విమానం దారిమళ్లింపు

|
Google Oneindia TeluguNews

సిబు: విమానం టేకాఫ్ అయి దాదాపు 40 నిమిషాలు అయింది. 163మంది ప్రయాణికులతో ఆ విమానం గాలిలో ప్రయాణిస్తోంది. ఒక్కసారిగా విమానంలో శబ్ధాలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది ఆ విమానం తలుపు(డోర్) సరిగా పడలేదని గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పైలట్‌కు తెలిపారు. దీంతో ఆ విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు.

ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని సిబు విమానాశ్రయం నుంచి దక్షిణ కొరియా వెళ్తున్న విమానాన్ని అకస్మాత్తుగా వెనక్కి దారి మళ్లించారు. కొరియాకు చెందిన ఆ జిన్ ఎయిర్ సంస్థ విమానంలో సుమారు 163 మంది ప్రయాణికులు ఉన్నారు.

Open door forces passenger plane to turn back

డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు గుర్తించిన సమయంలో ప్లేన్ సుమారు పది వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. వెంటనే విమానాన్ని వెనక్కి దారి మళ్లించే విషయాన్ని ముందుగానే ఇన్‌ఫ్లయిట్ ఆఫీసర్లు ప్రయాణికులకు తెలియజేశారు. ఆ తర్వాత విమానాన్ని సిబులో ల్యాండ్ చేశారు.

కాగా, ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తూ జిన్ ఎయిర్ సంస్థ వారికి 84.28 డాలర్లను నష్ట పరిహారంగా చెల్లించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు దక్షిణికొరియాకు చెందిన రవాణా మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.

English summary
A passenger plane carrying 163 people was forced to turn back 40 minutes into the flight after it was discovered one of the plane's doors was not completely shut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X