వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టర్ డొనాల్డ్ ట్రంప్.. వినండి: ఎన్నారై మహిళ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ మహిళ ఒకరు డొనాల్ట్ ట్రంప్‌కు బహిరంగ లేఖ రాశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న విషయం తెలిసిందే. అతడి వివాదాస్పద వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నారై మహిళ అతనికి బహరంగ లేఖ రాశారు.

డియర్ డొనాల్డ్ ట్రంప్.. తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని మీరు చేస్తున్న ప్రచారం, అతి త్వరలో ముగిసిపోయి తిరిగి ఇంటికి చేరుకుంటారని భావిస్తున్నాను. ఇటీవల నేను ఓ ఎయిర్ పోర్ట్ కాఫీ దుకాణంలో ఉన్న వేళ, మీరు ముస్లిమా? అని అడిగారు.

ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, నేను చామన ఛాయగా ఉంటాను కాబట్టి. ఎక్కువగా ఈ ప్రశ్న తెల్లగా ఉన్న వారి నుంచి ఎదురవుతుంది. దీనికి నేనిచ్చే సమాధానం.. నేను అమెరికన్‌ను అని. ఈ సమాధానం చాలామందికి నచ్చుతుంది. మీ వంటి వారికి మాత్రం ఇది సరైన సమాధానంగా అనిపించకపోవచ్చు.

ఇటీవలి కాలంలో ముస్లింల గురించి మీరెన్నో వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం నవంబర్లో వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ నేను చూశా. 9/11 దాడుల అనంతరం ముస్లింలు వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేయడం చూశానని మీరు వ్యాఖ్యానించారు. ఇది అవాస్తవం.

Open Letter From Indian Immigrant To Donald Trump

డిసెంబర్ 2015లో శాన్ బెర్నార్డినో పైన దాడి అనంతరం కూడా మీరు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. కొద్దికాలంగా అమెరికాలో వర్ణ వివక్ష ఎంతో పెరిగిపోయింది. నా తరహా రంగున్న వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ సిక్కు వ్యక్తిని ముస్లింగా అనుమానిస్తూ.. కొట్టి చంపారు.

ఓ తాతయ్యను నడిరోడ్డుపై పోలీసులు హింసించారు. ఎందుకు? ఆయన రంగు వేరని, ఇంగ్లీష్ మాట్లాడలేదని.. అవునా? నేను అమెరికాకు వచ్చి పన్నెండేళ్లయింది. ప్రారంభంలో నన్ను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. నా ఇంగ్లీష్ భాష సరిగా లేదన్నారు. విదేశీ యాసలో వేగంగా మాట్లాడుతున్నావన్నారు.

అప్పుడెప్పుడూ నేను మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు నాకు ప్రమాదాలు పొంచి ఉన్నాయనిపిస్తోంది. అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది. ఈ దేశంలో ఉన్న వారంతా మీకు లాగానే అమెరికన్లు అని మరచిపోతున్నారు. స్వాంతంత్రం అందరికీ సమానమేనని గుర్తించట్లేదు.

మేం ఈ దేశానికి వలస వచ్చాం. మేమంతా ఇప్పుడు అమెరికన్లమే. ఇది మా దేశం. ఎవరూ దీనిని కాదనలేరు. ఎంతగా వివక్ష ఎదుర్కొన్నా అమెరికన్లంతా సమానమే. మీ వివక్షాపూరిత వ్యాఖ్యలను సహించేది లేదు. కేవలం మతం, శరీర రంగు చూపిస్తూ వ్యాఖ్యలు చేయడం మానండి. అంటూ చంద్ర గంగూలీ దీనిని రాశారు.

English summary
I hope your campaign to be the next president of the United States will soon wrap up and you can return to your towers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X