వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరెన్ని చర్యలు తీసుకున్నా ఫర్లేదు : మసూద్ విషయంలో ప్రపంచ దేశాలు మా వైపేనన్న ఇండియా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు మోకాలాడ్డిన చైనా వైఖరిని భారత్ తప్పుపట్టింది. అజార్, ఆయన సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు నిరంతరం పోరాడుతామని శనివారం స్పందించింది. ఉప ఖండంలో ఉగ్రవాద కార్యకలాపాలను సహించబోమని .. ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టంచేసింది.

నిరంతరంగా ప్రయత్నిస్తాం ..

నిరంతరంగా ప్రయత్నిస్తాం ..

మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా అడ్డుపడలేదు .. కేవలం సాంకేతిక కారణాలే చూపించింది. కానీ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని స్పష్టంచేసింది. బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ .. మసూద్ ను అంతర్జాతీయ తీవ్రవాదని ప్రతిపాదన చేయగా .. డ్రాగన్ కంట్రీ టెక్నికల్ ఇష్యూస్ తెరపైకి తీసుకొచ్చి అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఉగ్రవాదం చైనాకు కూడా సమస్యే ...

ఉగ్రవాదం చైనాకు కూడా సమస్యే ...

ఉగ్రవాదం చైనాకు కూడా ప్రధాన సమస్యే అని ఇండియా విశ్వసిస్తోంది. పాకిస్థాన్ లో ఎన్ని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉన్నాయో చైనాకు తెలుసు. కానీ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు మాత్రం అడ్డుకొని .. తన వైఖరిని స్పష్టంచేస్తోంది. దీంతో మరోసారి చైనా, పాకిస్థాన్ బంధం ప్రపంచానికి అర్థమైంది అని భారత విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఔను నేను కాపాలదారుడినే .. సాంగ్ విడుదల చేసిన మోదీ ..వీడియోఔను నేను కాపాలదారుడినే .. సాంగ్ విడుదల చేసిన మోదీ ..వీడియో

ఫలించిన ఒత్తిడి .. అంగీకరించిన దేశాలు

ఫలించిన ఒత్తిడి .. అంగీకరించిన దేశాలు

పుల్వామా దాడుల తర్వాత అంతర్జాతీయ సమాజం మీద భారత్ చేసిన ఒత్తిడి ఫలించింది. జైషే మహ్మద్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు అగ్రదేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ అంగీకరించి .. ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశాయి. అయితే చైనా అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థల ఉనికి లేకుండా చేసేందుకు ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు నడుస్తామని భాతర్ స్పష్టంచేసింది.

English summary
india continued efforts to corner Pakistan and China on the issue of designating Masood Azhar as global terrorist. India continues to make its case on global level even as China continues to stonewall any attempts by United Nations Security Council (UNSC) to formally declare Masood Azhar as a global terrorist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X