• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవయవ మార్పిడి: తొలిసారి ముఖం, రెండు చేతులను విజయవంతంగా అతికించిన న్యూయార్క్ డాక్టర్లు

By BBC News తెలుగు
|
జో డిమెయో

ప్రపంచంలోనే తొలిసారి ముఖం, రెండు చేతుల మార్పిడి ఆపరేషన్‌ను న్యూయార్క్ డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు.

గత ఆగస్టులో జో డిమెయో అనే 22 ఏళ్ల వ్యక్తికి సుమారు 23 గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి రెండు చేతులు, ముఖాన్ని మార్చారు.

ఈ ఆపరేషన్‌లో 140మంది సిబ్బంది పాల్గొన్నారు.

2018లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో జో డిమెయో శరీరంలో 80శాతం కాలిపోయింది. వేలి ముద్ర వేయడానికి కూడా వీలు లేకుండా చేతులు కాలిపోయాయి. పెదవులు, కనురెప్పలు కూడా కాలిపోయాయి.

నైట్‌డ్యూటీ చేసి ఇంటికి వెళుతుండగా, నిద్ర ముంచుకు రావడంతో జో డిమెయో కారు అదుపు తప్పి క్రాష్‌ అయ్యి మంటల్లో చిక్కుకుంది.

అవయవ మార్పిడి చాలా క్లిష్టమైన ప్రక్రియ అని వైద్యులు చెబుతున్నారు

చికిత్స ఎలా జరిగింది?

కాలిన శరీరాలకు చికిత్స చేసే విభాగంలో నాలుగు నెలలపాటు డిమెయో చికిత్స పొందారు. కొన్నాళ్లు కోమా స్థితిలో కూడా ఉండిపోయారు.

ఆయనకు 20 వరకు శస్త్ర చికిత్సలు చేసి శరీరంలో కొంత భాగాన్ని సరి చేయగలిగినా చేతులు, ముఖాన్ని మార్చడం కష్టంగా మారింది.

దీంతో 2019లో వైద్యులు ఆయనను న్యూయార్క్‌లోని NYU లాంగోన్‌ ఎకడమిక్‌ మెడికల్‌ సెంటర్‌కు రిఫర్‌ చేశారు.

అక్కడే ఆయనకు చేతులు, ముఖం ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌ జరిగింది.

ఈ ఆపరేషన్‌ తనకు తనకు పునర్జన్మలాంటిదని అన్నారు డిమెయో .

“ కేవలం మంచి రూపంలో కనిపించడానికే కాక, తన చేతులతో పని చేసుకోవడానికి వీలుగా ఆయన్ను మార్చాలని భావించాం” అని అన్నారు ఎడుర్దో రోడ్రిగెజ్‌.

ఆయన ఈ ఫేస్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ ప్రాజెక్టుకు డైరక్టర్‌గా వ్యవహరించారు.

సర్జరీ తర్వాత డిమెయో 45 రోజులపాటు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స తీసుకున్నారు.

మరో రెండు నెలలు ఆసుపత్రిలో గడిపారు. ఇప్పుడాయన కళ్లు తెరవగలుగుతున్నారు. చేతులతో పని చేసుకుంటున్నారు.

గతంలో ఇలాంటి ఆపరేషన్లు జరిగాయా ?

ఈ తరహా ఆపరేషన్లు గతంలో రెండుసార్లు జరిగాయి. కానీ విజయవంతం కాలేదు. వాటిలో ఒక పేషెంట్ చనిపోగా, మరో కేసులో చికిత్స తీసుకున్న వ్యక్తి చేతులను పూర్తిగా తీసేయాల్సి వచ్చిందని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.

ఇప్పటి వరకు తన వద్దకు వచ్చిన పేషెంట్లలో డిమెయో అంత స్ఫూర్తిదాయకమైన పేషెంటును తన జీవితంలో చూడలేదని రోడ్రిగెజ్‌ అన్నారు. డిమెయో రోజూ ఐదు గంటలపాటు ఆసుపత్రిలో గడిపేవారని ఆయన వెల్లడించారు.

“ఆటలంటే డిమెయోకు చాలా ఇష్టం. మళ్లీ గోల్ఫ్‌ ఆడాలని ఆయన కోరుకుంటున్నారు. అతను బరువులు ఎత్తగలుగుతున్న తీరు, అతనిలో శక్తి నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి’’ అన్నారు రోడ్రిగెజ్‌.

డిమెయో ఇప్పుడు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకోగలుగుతున్నారు.

“ఇది జీవితంలో చాలా అరుదుగా లభించే వరం. నాకు అవయవాలు దానం చేసిన వ్యక్తి నా శరీరంలో మళ్లీ జీవిస్తున్నారు. నేను మా కుటుంబం అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబానికి రుణపడి ఉంటాం” అన్నారు డెమెయో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Organ transplantation: New York doctors successfully implant the face,both hands
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X