వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మల్నిచూసి లాడెన్ భయపడిచచ్చాడు: చంపిన వ్యక్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వేలాదిమందిని పొట్టన పెట్టుకున్న అల్ ఖైదా ఒసామా బిన్‌ లాడెన్‌కు ప్రాణ భయం ఉండేదా? అంటే అవుననే అంటున్నారు అతడిని మట్టుపెట్టిన అమెరికా ప్రత్యేక సైనిక దళం సీల్‌‌కు చెందిన రాబర్ట్‌ ఓ నీల్‌. తన నివాసంలో అత్యంత సమీపంలో తమను చూడడంతోనే లాడెన్‌ ప్రాణ భయంతో బెదిరిపోయాడని ఆయన చెప్పాడు.

తాము అతడిని చంపడానికే వచ్చామని అతడికి తెలుసునని, ఆ భయంతోనే చచ్చాడని, అదే అతడి జీవితానికి ముగింపు అని ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు. ముందు తాము ఇద్దరు అంగరక్షకులను హతమార్చి అతడి సమీపంలోకి రావడంతోనే లాడెన్‌ ముఖంలో ప్రాణ భయం కనిపించిందని నీల్‌ చెప్పాడు. లాడెన్‌ ఆయుధం పట్టే లోపే తాను 3 బుల్లెట్లను అతడి తలలో దించానని చెప్పాడు.

కాగా, పాకిస్ధాన్‌లో దాగిన ఒసామా బిన్ లాడెన్‌ను చంపిందెవరు? ఇన్నాళ్లు ఆ ఘనతను అమెరికా నేవీ సీల్ టీమ్ అంటూ చెప్పుకొచ్చారు. ఐతే ఆ నేవీ సీల్ టీమ్‌లో ఎవరో ఒకరు బిన్ లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి ఎవరో ఒకరు అయి ఉంటారు. కానీ, ఉగ్రవాదులు వారిని టార్గెట్‌ చేస్తారన్న భావనతోనే ఆ వ్యక్తి ఎవరో ఇన్నాళ్లూ బయటకు రానివ్వలేదు. కానీ ఇప్పుడా వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతడి పేరు రాబర్ట్ ఓ నీల్‌.

 Osama Bin Laden 'died affraid': US Navy Seal

ఆయన ఇంటర్వ్యూ ఓ చానల్లో వచ్చింది. బిన్ లాడెన్‌ను అతడు ఎలా చంపిందీ.. ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఎందుకు ఉన్నది తదితర వివరాలను ఆ ఇంటర్వ్యూలో చెప్పనున్నారని ఇంటర్వ్యూకు ముందే వార్తలు వచ్చాయి. అయితే, వాటిని డెయిలీమెయిల్‌ పత్రిక ముందుగానే సేకరించి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అమెరికా నేవీ నుంచి రిటైరయ్యాక ప్రభుత్వం తనను పట్టించుకోవట్లేదని, తన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏ సదుపాయాలూ కల్పించలేదని, ఈ నిరాశతోనే అతడీ విషయాలను బయటపెట్టడానికి నిర్ణయించుకున్నట్టుగా ఆ కథనం వివరించింది. అంతేకాదు.. దీనిపై రాబర్ట్ ఓ నీల్‌ తండ్రితో ఇంటర్వ్యూ కూడా చేసింది.

రాబర్ట్ ఓ నీల్‌ నిజంగానే అమెరికాలో పెద్ద హీరో. ఇరాక్‌, ఆఫ్గనిస్థాన్‌ సహా పలు యుద్ధాల్లో 400 కంబాట్‌ మిషన్లలో పాల్లొని.. 30 మందికి పైగా టాప్‌ టార్గెట్లను కాల్చి చంపిన అతణ్ని గొప్ప సీల్‌‌గా పరిగణిస్తారు. నిజజీవితంలో అతడి సాహసాల ఆధారంగా మూడు హాలీవుడ్‌ సినిమాలు(కెప్టెన్‌ ఫిలిప్స్‌, జీరో డార్క్‌ థర్టీ, లోన్‌ సర్వైవర్‌) వచ్చాయంటే అతడెంత గొప్ప యుద్ధవీరుడో అర్థం చేసుకోవచ్చు.

మోంటానాలోని బూట్‌ గ్రామంలో పెరిగిన రాబర్ట్ ఓ నీల్‌.. 19 ఏళ్ల వయసులో ప్రేమ విఫలమైందన్న బాధ నుంచి బయటపడటానికి నేవీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అదే అతడి జీవితాన్ని మార్చేసింది. 16 ఏళ్ల సర్వీసులో రాబ్‌ 52 సార్లు పతకాలు అందుకున్నాడు. బిన్ లాడెన్‌పై దాడిలో పాల్గొన్న సీల్స్‌ బృందంలో ఇలా బయటకు వచ్చిన రెండో వ్యక్తి రాబర్ట్ ‌. అంతక ముందు మాథ్యూ బిసొనెట్‌ అనే మరో సీల్‌, లాడెన్‌ను తాము ఎలా చంపిందీ వివరిస్తూ ‘నో ఈజీ డే' అనే వివాదాస్పద పుస్తకంతో వెలుగులోకి వచ్చాడు.

English summary
Osama Bin Laden 'died affraid' says, US Navy Seal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X