వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ కుటుంబ సంస్థ

By Srinivas
|
Google Oneindia TeluguNews

రబక్: ఒసాబా బిన్ లాడెన్‌కు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన టవర్‌ను నిర్మించనుంది. ఒసామా బిన్ లాడెన్ కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా మాజీ చీఫ్. అతనిని అమెరికా సైన్యం చంపేసింది.

Osama Bin Laden Family-Owned Group to Build Africa's Highest Tower

అయితే, బిన్ లాడెన్ కుటుంబానికి చెందిన కంపెనీ ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించాలని నిర్ణయించింది. ఆ కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణ సంస్థ 'సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూప్' మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తున్న 114 అంతస్థుల టవర్ నిర్మాణం చేపట్టనుంది.

దీని కోసం ఏకంగా రూ.6,100 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ టవర్ నిర్మాణం కోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒసామా ఈల్ హుస్సేన్ తెలిపారు. అలాగే, దక్షిణ కాసాబ్లాంకాలోని బౌస్కారాలో 250 హెక్టార్లలో మోడర్న్ సిటీ నిర్మించనున్నట్లు చెప్పారు.

English summary
A construction group owned by the family of Osama bin Laden is to build a 514-metre high tower in Casablanca, the economic capital of Morocco that will be the tallest on the African continent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X