• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో 9/11 తరహా మారణహోమానికి ప్లాన్: లాడెన్ మేనకోడలు హింట్: అడ్డుకోవాలంటే: ఆయనే

|

వాషింగ్టన్: అమెరికన్లను పీడకలలా వెంటాడే ఘటన.. 9/11 ఉగ్రదాడులు. 2001 సెప్టెంబర్ 11వ తేదీన చోటు చేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడులను తలచుకుంటే ఇప్పటికీ అమెరికన్లు ఉలిక్కిపడతారు. ప్రపంచాన్ని వణికించిన ఉదంతం అది. ప్రయాణికులతో నిండి ఉన్న రెండు విమానాలను హైజాక్ చేయడమే సంచలనంగా మారితే.. వాటితో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీ కొట్టడం, ట్విన్స్ టవర్స్‌ను కూల్చేయడం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఈ దాడుల వెనుక ఉన్న కింగ్‌పిన్.. మాస్టర్‌మైండ్.

మరోసారి అదే తరహా దాడులు..

మరోసారి అదే తరహా దాడులు..

ఎంత పక్కాగా ఆ కుట్రను రచించాడో.. అంతే పక్కాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. ఈ నెల 11వ తేదీ నాటికి 19 సంవత్సరాలను పూర్తి చేసుకోనుందా దారుణ ఉదంతం. 2,900 మందికి పైగా ఈ దాడుల్లో మృత్యువాత పడ్డారు. వేలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అమెరికా.. ఒసామా బిన్ లాడెన్‌ కోసం వెంటాడింది. వేటాడి మరీ మట్టుబెట్టింది. తాజాగా- 9/11 తరహా ఉగ్ర దాడులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ హింట్ ఇచ్చింది మరెవరో కాదు.. ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు నూర్ బిన్ లాడిన్.

ట్రంప్ గెలిస్తేనే..

ట్రంప్ గెలిస్తేనే..

2001 సెప్టెంబర్ 11న చోటు చేసుకున్న ఉగ్రదాడుల తరహా ఘటనలు అమెరికాలో ఇకముందు చోటు చేసుకోలేకపోవచ్చనడానికి గ్యారంటీ లేదని నూర్ బిన్ లాడిన్ స్పష్టం చేశారు. అలాంటి దాడులను నిలువరించ గలిగే శక్తి, సామర్థ్యాలు ఒక్క డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రమే ఉన్నాయనీ అన్నారు. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. మరోసారి పగ్గాలను అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమెరికాలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా 9/11 తరహా ఉగ్రవాదుల మహోగ్ర దాడులను నివారించాలంటే.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఉగ్రవాదుల పీచమణచడంలో..

ఉగ్రవాదుల పీచమణచడంలో..

ఈ మేరకు ఆమె న్యూయార్క్ పోస్ట్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 9/11 దాడుల నుంచి ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెనెంట్ (ఐసిస్) స్ఫూర్తి పొందిందనే విషయంపై తన వద్ద పక్కా సమాచారం ఉందని అన్నారు. అమెరికా సహా యూరప్ దేశాల్లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిందని అన్నారు. ఉగ్రవాదుల దాడులను నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారని, ఆయనే మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడ నివసిస్తున్నా.. అమెరికా బాగండాలని కోరుకుంటానని చెప్పారు.

  Israel & UAE Strike Historic Deal To Normalise Relations | Oneindia Telugu
  మరో రెండు నెలల్లో..

  మరో రెండు నెలల్లో..

  మరో రెండు నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్‌లో జరగబోయే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. డెమొక్రాట్ల తరఫున జో బిడెన్ బరిలో నిల్చున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. జో బిడెన్ స్వల్పంగా ఆధిక్యతలో ఉన్నారంటూ సర్వేలు వెలువడుతున్నాయి. ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

  English summary
  An endorsement from the bin Laden family is hardly the most coveted prize on the campaign trail, but Noor bin Ladin, niece of the 9/11 mastermind, has backed President Trump, claiming only he can save Western civilization. “ISIS proliferated under the Obama/Biden administration,” bin Ladin, who spells her surname different from her infamous uncle but has never made her relation a secret, told the New York Post on Saturday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X