వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రిని చంపినందుకు లాడెన్ కొడుకు హంజా ప్రతీకారం కోసం చూస్తున్నాడు

:ఆల్ ఖైదా నేత ఒసామాబిన్ లాడెన్ కొడుకు హంజా పగతో రగిలిపోతున్నాడని ఎఫ్ బి ఐ మాజీ ఏజంట్ ఒకరు ప్రకటించారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నాడని ఏజంట్ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:ఆల్ ఖైదా నేత ఒసామాబిన్ లాడెన్ కొడుకు హంజా పగతో రగిలిపోతున్నాడని ఎఫ్ బి ఐ మాజీ ఏజంట్ ఒకరు ప్రకటించారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నాడని ఏజంట్ చెప్పారు.

2011లో పాకిస్తాన్ లోని అబొట్టాబాద్ లో అమెరికా జరిపిన దాడుల్లో లాడెన్ హతమయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికే ఆల్ ఖైదాకు చెందిన కొన్ని వ్యక్తిగత లేఖలను అమెరికా స్వాధీనం చేసుకొంది. ఆ ఉత్తరాల్లో హాంజా తన తండ్రి లాడెన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్నాడని ఎప్ బి ఐ మాజీ ఏజంట్ అలీ సౌఫన్ తెలిపారు.

hamza

హంజా తన 22 వ, ఏళ్ళ వయసులో ఈ లేఖలు రాసినట్టు తెలిపింది. ప్రస్తుతం అతడి వయస్సు 28 ఏళ్ళు. అమెరికాలో దాడి తర్వాత ఆ కేసు దర్యాప్తు బృందానికి అలీ సౌఫన్ నాయకత్వం వహించారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు.

లాడెన్ గురించి ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. మీరు చూపు, మీ ప్రతి నవ్వు, నాకు చెప్పిన ప్రతి మాటను గుర్తుంచుకొంటాను అంటూ హంజా తన తండ్రి లాడెన్ కు రాసిన లేఖలో ప్రస్తావించాడని ఆయన చెప్పారు.

English summary
Osama bin Laden's son Hamza is poised to lead a stronger, larger al Qaeda and is "bent on avenging" his father's death, according to a former FBI agent familiar with the personal letters seized in a dramatic US raid that killed the al Qaeda leader in Pakistan's Abbottabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X