వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్ హీరో, మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సంచలనం, వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

నక్కజిత్తుల పాకిస్థాన్ వైఖరి క్షణానికోసారి మారుతుంటుంది. ఆ దేశంలో అధికారంలో ఉన్నవారే కాదే మాజీలు కూడా నోటి దూల ఎక్కువ. మాజీ పాకిస్థాన్ అధ్యక్షుడు, మాజీ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబందించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

పాకిస్థాన్ నేత ఫర్హతుల్లా బాబర్ ముషారఫ్ వీడియో సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో ఎప్పటిదీ, ముషారఫ్ ఎప్పుడూ మాట్లాడారు అన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ ముషారఫ్ మాత్రం.. అమెరికా దళాల కాల్పుల్లో మృతిచెందిన ఒసామా బిన్ లాడెన్, కశ్మీర్ అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

Osama bin Laden was Pakistan hero:Pervez Musharraf

ఒసామా బిన్ లాడెన్ పాకిస్థానీల హీరో అని ముషారఫ్ అందులో అన్నాడు. దీంతోపాటు కశ్మీర్‌లో అశాంతి గురించి ప్రస్తావించారు. కశ్మీర్ నుంచి ఎవరైతే పాకిస్థాన్ వస్తారో వారికి స్వాగతం పలుకుతామని చెప్పారు. వారికి పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. తిరిగి భారత సైన్యంపైకి ఊసిగొల్పుతామని చెప్పారు. లష్కరే తోయిబా సహా 12 ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లో పనిచేస్తున్నాయనే నిజాన్ని ముషారఫ్ వీడియాలో అంగీకరించాడు. అంతేకాదు లాడెన్ సహా మిగతా ఉగ్రవాదులు తమ హీరోలు అని పేర్కొన్నారు.

ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని ముషారఫ్ వ్యాఖ్యలతో తేటతేల్లమైపోయింది. కశ్మీర్‌లో అశాంతి సృష్టించడమే ఉగ్రవాదుల పనిగా మారిపోయిందని అర్థమైపోయింది. ఈ వీడియో ఎప్పటిదో తెలియడం లేదు. కానీ ముషారఫ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

English summary
slain terrorist Osama Bin Laden and other terrorists were Pakistan heroes former President Pervez Musharraf told in interview
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X