వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కాల్పుల్లో లాడెన్ తల చీలిపోయింది, అతికించి గుర్తించాం: యూఎస్ కమాండో

ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసిన తాలిబన్ ఉగ్రవాద నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన అమెరికా కమాండో రాబర్ట్ ఓనీల్ ఆ ఆపరేషన్‌కు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. ‘ది ఆపరేటర్‌’ పేరుతో ఓ పుస

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసిన తాలిబన్ ఉగ్రవాద నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన అమెరికా కమాండో రాబర్ట్ ఓనీల్ ఆ ఆపరేషన్‌కు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. 'ది ఆపరేటర్‌' పేరుతో ఓ పుస్తకాన్ని రచించాడు. దీనిలో బిన్‌లాడెన్‌ ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును కళ్లకు కట్టాడు.

ఈ ఆపరేషన్‌ మొత్తం కేవలం 90నిమిషాల్లో పూర్తయినట్లు ఓనీల్‌ పేర్కొన్నాడు. మొత్తం ఆరుగురు నేవీ సీల్స్‌ బృందం(అమెరికాలోని అత్యున్నత కమాండోలు) బిన్‌లాడెన్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలిపాడు. ఈ బృందంలో తాను కాల్చడం వల్లే బిన్‌లాడెన్‌ మృతిచెందినట్లు వెల్లడించాడు.

Osama's head had to be pieced together for it to be identified: Ex Navy SEAL

ఆపరేషన్ తీరును వివరిస్తూ.. 2011లో పాకిస్థాన్‌లోని అబౌట్టాబాద్‌లో లాడెన్‌ దాక్కొన్నట్లు భావిస్తున్న భవనంపై అమెరికన్‌ నేవీ సీల్స్‌ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ఓనీల్‌ ముందు నడుస్తుుండగా మరో ఐదుగురు నేవీ సీల్స్‌ ఆయన వెనుకే రెండో అంతస్తుకు చేరుకున్నారు. అక్కడే లాడెన్‌ ముగ్గురు భార్యలు, 17 మంది సంతానం ఉన్నట్లు భావించారు.

అక్కడే ఒక వ్యక్తి ఏకే47 తుపాకీతో మెట్ల రెయిలింగ్‌ చాటున దాక్కొని కనిపించాడు. అతను ఖలీద్‌ అన్న విషయాన్ని సీఐఏ వెంటనే ధ్రువీకరించి సీల్స్‌కు సమాచారం అందించింది. ఆపై అంతస్తులో లాడెన్‌ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వెంటనే కమాండోలు 'ఖలీద్‌ ఇటు రా..' అని అరబిక్‌లో పిలిచారు. దీనికి స్పందించిన ఖలీద్‌ 'ఏంటీ' అంటూ బయటకు వచ్చాడు. వెంటనే అతని తలపై కాల్పులు జరిపారు సీల్స్. ఆ వెంటనే ఓనీల్‌ అక్కడి నుంచి మరో సీల్‌తో కలిసి మూడో అంతస్తుకు చేరుకున్నాడు.

అక్కడ ఎవరైన ఆత్మాహుతి దాడికి సిద్ధంగా ఉంటారేమోనని సీల్స్‌ భావించారు. ఇక పోరు తప్పదని భావించిన ఓనీల్‌ దానికి మానసికంగా సన్నద్ధమైపోయాడు. ఈ విషయాన్ని తన సహచరుడి భుజం గట్టిగా నొక్కి సంజ్ఞ చేశాడు. వెంటనే అతను కర్టెన్‌ పక్కనే పడి ఉన్న ఇద్దరు మహిళలను అదుపుచేశాడు. మరోపక్క ఓనీల్‌ సమీపంలోని మంచం వద్ద బిన్‌లాడెన్‌ను గుర్తించాడు. ఆ సమయంలో లాడెన్‌ ఒక యువతిని తనకు అడ్డంగా పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు.

అప్పటికే సీల్స్‌ జరిపిన కాల్పుల్లో ఒక తూటా యువతి కాల్లోకి దిగింది. వెంటనే ఓనీల్‌ ఆ యువతి భుజంపై నుంచి లాడెన్‌ తలలోకి రెండుసార్లు కాల్చాడు. అతను చనిపోయాడని ఓనీల్‌కు నమ్మకం కుదిరేందుకు మూడోసారి కూడా తలలోకి కాల్చాడు. తర్వాత భయంతో గదిలోని ఓ మూల దాక్కొని ఉన్న లాడెన్‌ రెండేళ్ల కుమారుడి వద్దకు ఓనీల్‌ చేరుకున్నప్పుడు.. మిగిలిన సీల్స్‌ బృందం ఆ గదిలోకి అడుగుపెట్టింది.

లాడెన్‌ అడ్డుపెట్టుకున్న 18ఏళ్ల యువతిని అతని చిన్న భార్య అమల్‌గా గుర్తించారు.
అయితే, ఓనీల్‌ జరిపిన కాల్పుల్లో లాడెన్‌ తల చీలిపోయింది. దీంతో అతన్ని గుర్తించేందుకు వీలుగా తలను దగ్గరపెట్టి నొక్కాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్‌ మొత్తం 90 నిమిషాల్లో ముగించుకున్న సీల్స్‌బృందం తిరిగి ఆఫ్గనిస్థాన్‌లోని తమ స్క్వాడ్రన్‌ క్యాంప్‌కు చేరుకుంది.

English summary
The head of Osama Bin Laden was pieced together for it to be identified, an ex-Navy SEAL who was part of the operation claimed. He said that Osama's head was so badly destroyed by gunfire that they had to piece it together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X