వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాల్ని చంపిన ప్రిస్టోరియస్‌కు మానసిక పరీక్షలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్రిటోరియా: నిరుడు (2013) ప్రేమికుల దినోత్సవం రోజు తన ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంపును కాల్చివేసిన బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ మానసిక పరిస్థితిని పరిశీలించాలని స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. మంగళవారం దక్షిణాఫ్రికాలో గల కోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆదేశాలు జారీ చేశారు. పిస్టోరియస్ ముప్పై రోజుల పాటు ఆసుపత్రికి హాజరు కావాలని సూచించారు.

న్యాయమూర్తి తొకజిలే మసిపా ఆదేశాలిస్తూ... పారాలింపియన్ స్ప్రింటర్ అస్కార్ పిస్టోరియస్ ప్రతి రోజు స్థానిక వెకోపీస్ సైకియాట్రిక్ ఆసుపత్రిలో అటెండ్ కావాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం వెళ్లి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే ఉంటాలని ఆదేశించారు.

Oscar Pistorius sent for 30 days of psychiatric tests

కాగా, ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంపును బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ గత ఏడాది కాల్చి చంపిన విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు వేకువజామునే పిస్టోరియస్ ఆమెను కాల్చి చంపాడు. ఆ రాత్రి అంతా ఆమెతో అతను వాగ్వాదానికి దిగాడనే విమర్శలు వచ్చాయి. అనంతరం అతనిని పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు ఫిబ్రవరి 14న ప్రియుడి చేతిలో మృతి చెందిన రీవా ప్రేమికుల దినోత్సవం రోజు ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ప్రేమ కోసం ఈ రోజు మీరెలాంటి సర్ ప్రైజ్ చేయబోతున్నారని ట్వీట్ చేసింది. అదే రోజు పిస్టోరియస్‌ చేతిలో హత్యగావించబడింది.

English summary
A South African judge on Tuesday ordered Oscar Pistorius to undergo up to 30 days of psychiatric tests to establish if he is "criminally responsible" for killing his girlfriend on Valentine's Day 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X