India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Oscars 2022: విల్ స్మిత్ భావోద్వేగం: కన్నీరు పెట్టుకున్న సూపర్ స్టార్: ఆ పని చేసినందుకు సారీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మకమైన 94వ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్‌ను వరించింది. ఈ సంవత్సరం ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. కింగ్ రిచర్డ్ సినిమాలోని నటనకు అతనికి ఈ అవార్డు లభించింది. అమెరికన్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. రెనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకుడు. టెన్నిస్ ప్రపంచానికి సెరెనా విలియమ్స్, ఆమె సోదరి వీనస్ విలియమ్స్‌ను అందించిన వారి తండ్రి కమ్ కోచ్ రిచర్డ్ విలియమ్స్.. జీవితం ఆధారంగా దీన్ని తెర కెక్కించారు.

ఆ క్యారెక్టర్‌లో ఒదిగిన సూపర్ స్టార్..

ఆ క్యారెక్టర్‌లో ఒదిగిన సూపర్ స్టార్..

ఆయన పేరే ఈ మూవీకి పెట్టారు. టైటిల్ రోల్‌లో నటించాడు విల్ స్మిత్. కోచ్‌గా ఒదిగిపోయాడు. ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడు. ఫలితంగా ఆస్కార్ అవార్డ్ అతని చేతిలో వాలింది. అమెరికా లాస్ ఏంజిలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కమేడియన్ క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడం- ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన భార్యపై జోక్ వేసిన కారణంతో విల్ స్మిత్ అతని చెంప పగులగొట్టాడు అందరూ చూస్తుండగానే.

క్రిస్ రాక్‌పై పంచ్..

క్రిస్ రాక్‌పై పంచ్..

తొలుత- స్టేజీ మీదికి వచ్చిన క్రిస్ రాక్.. తనదైన శైలిలో అందరినీ నవ్వించాడు. అతను వేసిన జోక్స్‌కు ఓ దశలో విల్ స్మిత్, అతని భార్య జేడ్ పింకెట్ స్మిత్ సైతం ఎంజాయ్ చేశారు. అదే సమయంలో- జేడ్ పింకెట్ స్మిత్‌పై క్రిస్ రాక్ వేసిన ఓ జోక్.. అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది విన్న వెంటనే విల్ స్మిత్ వేగంగా అడుగులు వేసుకుంటూ స్టేజీ మీదికి వెళ్లాడు. ఏ మాత్రం వెనుకాముందు ఆలోచించకుండా క్రిస్ రాక్ ముఖంపై పంచ్ విసిరాడు.

అవార్డు అందుకున్న తరువాత భావోద్వేగ ప్రసంగం..

అవార్డు అందుకున్న తరువాత భావోద్వేగ ప్రసంగం..

వెనక్కి వచ్చి తన సీట్లో కూర్చున్న తరువాత కూడా గట్టిగా అతన్ని తిట్టడం వినిపించింది. నీ నోటి నుంచి నా భార్య పేరును మరోసారి వినదలచుకోలేదు.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు విల్ స్మిత్. ఆ తరువాత మెత్తబడ్డాడు. తప్పు చేశానని గ్రహించాడు. ఉత్తమ అవార్డును అందుకున్న తరువాత.. కొద్దిసేపు ప్రసంగించాడు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. అకాడమీకి క్షమాపణ చెప్పాడు.

పిన్ డ్రాప్ సైలెంట్‌గా..

అకాడమీ అవార్డుల ఫంక్షన్‌కు వచ్చిన వారందరినీ అగౌరవ పరిచానని తాను భావిస్తున్నానని చెప్పాడు. అకాడమీకి, తోటి నామినీల క్షమాపణ కోరుతున్నానని అన్నాడు. అతను ప్రసంగిస్తోన్న సమయంలో డాల్బీ థియేటర్‌ వాతావరణం పిన్ డ్రాప్ సైలెంట్‌గా మారింది. తోటి నటీనటులు, నామినిలు సైతం కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. ప్రసంగం పూర్తయిన అనంతరం ఒక్కసారిగా చప్పట్లో మార్మోగిపోయిందా థియేటర్. తోటి నటీనటులు అతణ్ని అభినందనలతో ముంచెత్తారు.

English summary
Will Smith Apologizes to the Academy in Best Actor Acceptance Speech After Appearing to Hit Chris Rock at 2022 Oscars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X