వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

OTT:మరో ఓటీటీ, యూట్యూబ్ ప్లాన్.. చానెల్ స్టోర్ ప్లాట్‌ఫామ్..?

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా ఓటీటీ ట్రెండ్.. అవును అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్, డిన్నీ ప్లస్ హాట్ స్టార్, జీ 5.. అంతా ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తున్నారు. థియేటర్‌కు వెళ్లడం తక్కువ అయిపోయింది. దీనికితోడు టికెట్ల ధరల వాత మాములుగా లేదు. కోట్లాదిమంది సబ్ స్క్రైబర్లతో ఓటీటీలు రెండు చేతులా ఆర్జిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆహా పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే.

యూట్యూబ్ స్ట్రీమింగ్..

యూట్యూబ్ స్ట్రీమింగ్..

యూట్యూబ్ కూడా ప్రత్యేక స్ట్రీమింగ్ సర్వీస్‌పై దృష్టి పెట్టింది. చానెల్ స్టోర్ అనే అంతర్గత పేరుతో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంకు సంబంధించి పనులు నడుస్తున్నాయట. ఈ స్ట్రీమింగ్ సర్వీసులకు సంబంధించి గతంలో పలు ఎంటర్ టైన్ మెంట్ కంపెనీలతో యూట్యూబ్ చర్చించిందట. మళ్లీ ఆ చర్చలను మొదలుపెట్టింది. దీంతో త్వరలో యూట్యూబ్ ఓటీటీ కూడా వస్తోందని విశ్వసనీయ సమాచారం.

టాప్‌లో యూట్యూబ్.. కానీ

టాప్‌లో యూట్యూబ్.. కానీ


ప్రపంచవ్యాప్తంగా వీడియో కంటెంట్ కు సంబంధించి యూట్యూబ్ టాప్‌లో ఉంటుంది. ఇందులో యూజర్లు ఎవరికి వారు అప్ లోడ్ చేసే వీడియోలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ సొంతంగా ఎలాంటి వీడియోలు, సినిమాలు, సిరీస్ వంటివి అందుబాటులో ఉండవు. ఇప్పుడు కొత్తగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌తో అదీ నెరవేరనుంది.

ఒక్కో సినిమాకు ఒక్కో రేటు

ఒక్కో సినిమాకు ఒక్కో రేటు

యూట్యూబ్ లో డబ్బులు చెల్లించి కొత్త సినిమాలు చూసే అవకాశం ఉన్నా.. అది కేవలం ఒక్కో సినిమాకు ఇంత అని రేటు చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఆ కంటెంట్ కూడా యూట్యూబ్ కొనుగోలు చేసింది కాదు. తమ ప్లాట్ ఫామ్‌పై పెట్టినందుకు కొంత కమీషన్ మాత్రమే తీసుకునేది. కంటెంట్ ఇతర వేదికలపై అందుబాటులో ఉంటుంది. స్ట్రీమింగ్ సర్వీసులు అయితే.. సినిమాలు, వెబ్ సిరీస్ వంటివి కొనుగోలు చేయడంతోపాటు సొంతంగా నిర్మించడం ద్వారా తమ ప్లాట్ ఫామ్‌లో పెడతాయి. ప్లాట్ ఫామ్‌లలో తప్ప మరెక్కడా అధికారికంగా అందుబాటులో ఉండవు. ఆ కంటెంట్ ఆయా ప్లాట్ ఫా‌పై చూడాల్సి ఉంటుంది.

Recommended Video

ఇలా అవుతే ఎలా , నష్టం మనకే గా , ఒక్క సారి ఆలోచించండి ప్లీజ్ *Entertainment | Telugu OneIndia
పెయిడ్ స్ట్రీమింగ్ సర్వీస్

పెయిడ్ స్ట్రీమింగ్ సర్వీస్


సొంతంగా పెయిడ్ స్ట్రీమింగ్ సర్వీసును తెచ్చేందుకు యూట్యూబ్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడే పని ప్రారంభమైందని.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ త్వరలో యూట్యూబ్ ఓటీటీ రానుంది. ఇదీ టాప్ ఓటీటీలకు కాంపిటీషన్‌గా నిలవనుంది.

English summary
OTT:youtube plans to launch video streaming service. in soon channel store platform is may be launched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X