వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదుపుతప్పిన చైనా స్పేస్‌ల్యాబ్ ఎక్కడ కూలుతుందో తెలిసిపోయింది!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కొన్నాళ్లుగా నియంత్రణ కోల్పోయిన చైనీస్ స్పేస్‌ల్యాబ్ భూమ్మీద కూలిపోనుందనే వార్త అందరినీ భయపెడుతోంది. అటు శాస్త్రవేత్తలు, ఇటు సాధారణ జనం కూడా ఇది ఎప్పుడు, ఎక్కడ కూలుతుందో తెలియక వణికిపోతున్నారు. అయితే ఈ స్పేస్‌ల్యాబ్ ఎప్పుడు, ఎక్కడ కూలుతుందనే విషయంలో తాజాగా మరింత సమాచారం తెలిసింది.

2011లో చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తియాంగోంగ్-1 అంతరిక్ష కేంద్రాన్ని ప్రయోగించింది. 2016 నుంచి ఈ స్పేస్‌స్టేషన్ నియంత్రణ కోల్పోయిందని, భూమిని ఢీకొట్టబోతున్నదని వార్తలు వస్తూనే ఉన్నాయి. అది వింతగా ప్రవర్తిస్తోందని దీని కదలికలను గమనిస్తున్న నిపుణులు చెబుతున్నారు.

Out-of-control Chinese satellite ‘to land on Michigan’ where 10,000 Americans live

ఈ స్పేస్‌స్టేషన్‌లో ప్రమాదకరమైన ఇంధనం ఉండటమే అందరికీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఎనిమిదిన్నర టన్నుల స్పేస్‌స్టేషన్ భూవాతావరణంలోకి రాగానే చాలా వరకు మండిపోతుందని, పది నుంచి 40 శాతం శకలాలు మాత్రమే భూమిపై పడతాయని అంచనా వేస్తున్నారు.

<strong>21 రోజులే గడువు, దూసుకొస్తున్న చైనా స్పేస్ ‌స్టేషన్, భూమికి ఏం జరుగుతుందో?</strong>21 రోజులే గడువు, దూసుకొస్తున్న చైనా స్పేస్ ‌స్టేషన్, భూమికి ఏం జరుగుతుందో?

ఇన్నాళ్లూ ఇది ఎక్కడ కూలుతుందనే విషయంలో స్పష్టత లేకపోయింది. ఉత్తర చైనా, మధ్య ఇటలీ, ఉత్తర స్పెయిన్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, టాస్మానియా, సౌత్ అమెరికాలలోనూ ఎక్కడైనా కూలిపోయే అవకాశం ఉన్నట్లు గతంలో సైంటిస్టులు చెప్పారు.

ఇప్పుడు కాస్త కచ్చితంగా అమెరికాలోని మిచిగాన్ ప్రాంతలో కూలిపోతుందని చెబుతున్నారు. ఇది నిజమో, కాదో తెలియాలంటే ఏప్రిల్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం ఈ మిచిగాన్ ప్రాంతంలో దాదాపు 10 వేల మంది నివస్తున్నారు.

English summary
The massive eight tonne ‘space lab’ named Tiangong-1 vanished from China’s eyes in March 2016, and experts had failed to relocate it. However, authorities have now tracked it down and predict that it will come hurtling back towards Earth before the end of this month. Experts have been unable to pinpoint where the craft could land, but as it approaches Earth, there is a very realistic chance it could hit Michigan where almost 10 million people live.According to Michigan website MLive says Lower Michigan falls “into the regions listed with the highest probability” of debris from Tiangong-1 hitting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X