వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1,007 రోబోల బ్రేక్ డ్యాన్స్: గిన్నీస్ రికార్డు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో రోబోలు బ్రేక్ డ్యాన్స్ చేశాయి. బీర్ ఫెస్టివల్ లో భాగంగా ఏర్పాటు చేసిన రోబోల బ్రేక్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకోవడమే కాకుండా గిన్నిస్ బుక్ రికార్డును సాధించాయి. చైనాలోని షాన్డాంగ్ రాష్ట్రంలోని క్విండగోలో ఈ బీర్ ఫెస్టివల్ నిర్వహించారు.

క్విండగో నగరంలో బీర్ ఫెస్టివల్ గ్రాండ్ గా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఏదైనా ప్రత్యేకత ఉండాలని నిర్వహకులు భావించారు. రోబోలతో బ్రేక్ డ్యాన్స్ చేయించాలని నిర్ణయించారు.

Over 1,007 dancing Robots set Guinness Record in China

1,007 రోబోలతో బ్రేక్ డ్యాన్స్ చేయించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. వినూత్నంగా డ్యాన్స్ చేసిన రోబోలు అందరిని విశేషంగా ఆకర్షించాయి. క్యూ ఆర్సీ -2 పేరున్న ఈ రోబోలు 19 అంగులాలు పోడవుతో అన్ని ఒకే సైజ్ లో ఉన్నాయి.

మొబైల్ ఫోన్ కంట్రోల్ తో అన్ని రోబోలు ఒకే సారి డ్యాన్స్ చేయడంతో అందరిని భిన్నంగా ఆకట్టుకుంది. ఒక నిమిషం (60 సెకండ్లు) అద్బుతంగా డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకోవడమే కాకుండ గిన్నీస్ బుక్ రికార్డు కైవసం చేసుకున్నాయి.

English summary
A new Guinness World Record for the most robots dancing simultaneously has been set in China where 1,007 robots shimmied in unison, nearly double the previous record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X