• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్‌కు వ్యతిరేకంగా అద్దాలతో మహిళల నగ్న ప్రదర్శన

By Nageshwara Rao
|

క్లీవ్‌లాండ్: వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఏ మాత్రం అర్హత లేదంటూ క్లీవ్ లాండ్‌లో ‌వందలమంది మహిళలు నగ్నంగా రోడ్డుపైకి వచ్చి అద్దాలతో తమ నిరసన తెలిపారు.

ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్ట్ ట్రంప్‌ను రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించే కార్యక్రమం జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సభా వేదిక వద్దకు చేరుకున్న వీళ్లంతా ఇలా నగ్న ప్రదర్శన జరిపారు. న్యూయార్క్‌కు చెందిన ఫేమస్ ఫోటాగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రదర్శన నిర్వహించారు.

వేదిక వద్దకు చేరుకున్న మహిళలు 'హి ఈజ్ ఏ లూజర్ ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు 130 మంది మహిళలు పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమంలో టునిక్ వాళ్లందరినీ ఫొటో షూట్ కూడా చేశాడు. నవంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికలకు ముందు వీళ్లకు సంబంధించిన నగ్న నిరసన ఫొటోలను ట్యునిక్ విడుదల చేస్తాడు.

Over 100 nude women pose against Donald Trump in Cleveland

క్లీవ్ లాండ్ చట్టాల ప్రకారం బహిరంగ నగ్న ప్రదర్శన చేయడం అనేది నేరం. అయితే నగ్నప్రదర్శన చేసేందుకు కన్వన్షన్ జరిగే బిల్డింగ్ యజమాని అనుమతి తీసుకోవడంతో పోలీసులు కూడా జోక్యం చేసుకోలేదు. కాగా నగ్నఫోటోలను తీయడంలో ట్యునిక్ సుప్రసిద్ధుడు.

ఈ సందర్భంగా ట్యునిక్ మాట్లాడుతూ తాను ఇంతవరకు రాజకీయాలకు సంబంధించిన ఫోటోలు ఏమీ తీయలేదని ఇదే చాలా పెద్ద ఎత్తున చేసిన రాజకీయ ఫొటో షూట్ అని ఆయన పేర్కొన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ఫోటోషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.

నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసినంత మాత్రాన సరిపోదని, ఇలా నిరసన కూడా తెలపాల్సిందేనని అన్నాడు. తనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. రిపబ్లికన్ పార్టీ పాలనలో మహిళలు, మైనారిటీల మీద జరిగే ఘోరాలను తాను సహించలేనని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ట్యునిక్ చర్యలు తనకు నచ్చడం వల్లే ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు ఆర్ట్ ప్రొఫెసర్, ఆర్టిస్ట్ అయిన మాపో కినార్డ్ (55) అనే మహిళ చెప్పారు. బట్టలు లేకుండా పూర్తిగా నగ్నంగా రోడ్డుమీద నిలబడటానికి కూడా భయం లేకుండా ఉండటమే తమకు కావాలని ఆమె అన్నారు.

ముస్లింలను అమరికాలోకి రాకుండా నిషేధించాలంటూ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
More than a hundred women stripped and posed naked with mirrors in Cleveland, answering a photographer's call to blend art with politics and portray Donald Trump as unfit for the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more