వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వలసదారుల పడవ మునిగి 97 మంది గల్లంతు
ట్రిపోలి: సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది వలసదారులు గల్లంతైన ఘటన లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో మొత్తం 120 మంది శరణార్థులు ఉన్నారు. వారిలో దాదాపు ఇరవై మందిని లిబియా కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన వారి జాడ ఇంకా తెలియలేదు.

గత మూడేళ్లలో లిబియా నుంచి లక్షా 50 మంది శరణార్థులు వెళ్లారు. వారంతా ఒక్కసారిగా పడవలు ఎక్కి, పడవ సామర్థ్యానికి మంచి ప్రయాణిస్తుండడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి ఆయుబ్ కసీమ్ మాట్లాడుతూ.. 23 మందిని కాపాడామని చెప్పారు.
పడవలో 120 మందిమి ఉన్నామని ప్రమాదం నుంచి బయటపడిన వారు చెప్పారు. 97 మంది ఆచూకీ ఇంకా లభించలేదని, అందులో 15 మంది మహిళలు, పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.