వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సాఫర్డ్ టీకా పాజిటివ్ న్యూస్: యువతోపాటు వృద్ధుల్లో కూడా ఇమ్యూన్ రెస్పాన్స్

|
Google Oneindia TeluguNews

లండన్: కరోనా కట్టడికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా టీకా యువతతోపాటు వృద్ధుల్లో కూడా ఒకేలాంటి రోగనిరోధక ప్రతిస్పందనను కలిగిస్తున్నట్లు తేలింది. ఇంతకుముందులా కాకుండా, వృద్ధుల్లో ప్రతికూల స్పందన చాలా తక్కువగా ఉందని బ్రిటన్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా సోమవారం వెల్లడించింది.

టీకా తీసుకున్న వృద్ధులు యువతలో రోగ నిరోధక ప్రతిస్పందన ఒకేలా ఉందని, కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న వయసు మళ్లిన వ్యక్తుల్లో ప్రతికూల చర్యలు చాలా తక్కువగా ఉండటం ప్రోత్సాహకంగా ఉందని పేర్కొంది. టీకా ఫలితాలు రోగనిరోధకత, భద్రతను మరింత వెల్లడిస్తాయని తెలిపింది.

Oxford Coronavirus vaccine prompting immune response in young, old: AstraZeneca

కరోనావైరస్ కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యే వృద్ధుల్లో టీకా రక్షిత యాంటీబాడీలు, టీ సెల్స్‌ను ప్రేరేపిస్తుందని ఇప్పటికే ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కరోనా విజృంభణతో కలవరపాటు గురైన ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ టీకా ఆశాజనకంగా కనిపించింది.

ఏప్రిల్‌లో ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టీకాను సంబంధించిన లైసెన్స్‌ను ఆస్ట్రాజెనికా సంస్థకు ఇచ్చింది. ఇది వివిధ దశలకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించింది. త్వరలో చివరి దశ ప్రాథమిక ఫలితాలు వెల్లడికానున్నాయి.

కాగా, ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేస్తోన్న తొలి విడత టీకాను స్వీకరించడానికి సిద్ధంగా ఉండమని లండన్ ఆస్పత్రి ట్రస్ట్ సిబ్బందికి ఆదేశాలు అందినట్లు అక్కడి మీడియా తెలిపింది. నవంబర్ 2వ తేదీ నుంచి ఆ స్వీకరణ ప్రారంభం కానున్నట్లు తెలిసింది.

Recommended Video

Covaxin, Bharat Biotech's Coronavirus Vaccine Cleared For Phase 3 Trials || Oneindia Telugu

బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హౌన్‌కాక్ ప్రముఖ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి టీకా సిద్ధంగా లేదని, అయితే, దాని పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చేస్తున్నట్లు తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే, తాము అన్నింటికీ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

English summary
Oxford's Covid-19 vaccine candidate prompts an immune response in both young and old adults, AstraZeneca Plc said on Monday. The Anglo-Swedish drugmaker is collaborating with the University of Oxford for the manufacturing of its ChAdOx1 vaccine for coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X