వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: ఆక్స్‌ఫర్డ్ ఫస్ట్ ఫేజ్ ప్రయోగం సక్సెస్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో పెరిగిన ఇమ్యూనిటీ..

|
Google Oneindia TeluguNews

గుడ్ న్యూస్.. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడ గడ లాడిస్తోండగా వ్యాక్సిన్ కోసం ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. మొదటి విడత ప్రయోగం విజయవంతమయ్యిందని శాస్త్రవేత్తల బృందం తెలిపిందని లాన్సెంట్ జర్నల్ సోమవారం ప్రచురించింది. వాలంటీర్ల శరీరం యాంటిబాడీస్, తెల్లరక్త కణాలు పెరిగాయని వివరించింది. మరో రెండు విడదల ప్రయోగం, ఫలితాల తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం 2,3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది.

Recommended Video

COVID-19 : Oxford Vaccine తో Coronavirus కు చెక్.. ఫస్ట్ ఫేజ్ ప్రయోగం సక్సెస్! || Oneindida Telugu
ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్

ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు క్లినికల్స్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు గల 1077 మంది వాలంటీర్లపై మొదటి విడత ప్రయోగం చేశారు. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకు 28 రోజులకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇచ్చి.. వారి శరీరంలో పనితీరును గమనించారు. హెల్త్ ప్రొఫైల్ గమనించి.. వారి శరీరం స్పందిస్తోన్న తీరును మీడియాకు విడుదల చేశారు. మొదటి విడతలో ఇచ్చిన వ్యాక్సిన్ వాలంటీర్ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుందని తెలిపారు.

పెరిగిన యాంటీబాడీస్

పెరిగిన యాంటీబాడీస్

శరీరంలో యాంటిబాడీస్, తెల్లరక్త కణాలు పెరిగాయని తెలిపారు. టీకా అన్నివిధలా సురక్షితం అని చెప్పారు. రెండో దశ ప్రయోగం కూడా పూర్తయ్యిందని.. కానీ వాలంటీర్ల స్పందనను పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం మూడో దశ కొనసాగుతోందని.. మరో 2,3 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మూడో విడతలో బీపీ, డయాబెటిక్ ఉన్నవారికి కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. అన్నిరకాల ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారిని పరిశీలించి.. మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదల చేసే అవకాశం ఉంది.

భారతీయ వైద్యులు

భారతీయ వైద్యులు

28 రోజుల సమయంలో వాలంటీర్లకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మల్టీపుల్ డోజ్ ఇచ్చామని తెలిపారు. అయితే వైద్య బృందంలో భారతీయులు కూడా ఉన్నారని మీడియాకు అందజేసిన ప్రకటనలో ఉంది. భారతీయ వైద్యులు కూడా వ్యాక్సిన్ తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

English summary
Oxford University's coronavirus vaccine candidate has been shown to be safe and able to induce immune response against the virus in phase I/II human trials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X