వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Oxford Corona Vaccine: కీలక ముందడుగు, రెండో దశకు సిద్ధం

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి దిశగా మరో అడుగుపడింది. ఆక్స‌ఫర్డ్ తయారు చేస్తున్న ChAdOx1 nCov-19 టీకా రెండో దశలో భాగంగా విస్తృత ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. మనుషులపై తొలి దశ ప్రయోగాలు పూర్తి చేసి రెండో దశ ప్రయోగాలకు సిద్ధమైనట్లు తెలిపింది.

షాకింగ్: క్యాబ్ డ్రైవర్‌పై ఉమ్మేసిన కరోనా బాధితుడు, నెల రోజులకే మృతి, ఏం జరిగిందంటే?షాకింగ్: క్యాబ్ డ్రైవర్‌పై ఉమ్మేసిన కరోనా బాధితుడు, నెల రోజులకే మృతి, ఏం జరిగిందంటే?

రెండో దశలో 10వేల మందిపై..

రెండో దశలో 10వేల మందిపై..

రెండో దశలో 10,260 మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీరిలో 56 ఏళ్లు పైబడినవారు, 5-12ఏళ్ల మధ్య వారు ఉన్నట్లు తెలిపింది. ఇది కూడా పూర్తయితే మూడో దశ మొదలు పెట్టనున్నట్లు
వెల్లడించారు. ఈ దశలో 18 ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగించి ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటామని వెల్లడించింది.

రోగ నిరోధక శక్తి పెంచేలా..

రోగ నిరోధక శక్తి పెంచేలా..

కరోనావైరస్‌కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ChAdOx1 nCov-19 అనే టీకాను అభివృద్ధి చేశారు. దీనిలో వినియోగించిన అడినో వైరస్‌ను చింపాజీల నుంచి సేకరించారు. వీటిలో జన్యుపరమైన మార్పులు చేసి సార్స్ కోవ్2లో ఉండే స్పైక్ ప్రోటీన్ వంటి పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత రోగ నిరోధక శక్తిని తయారు చేసుకునేలా ప్రేరేపిస్తుంది.

కోతుల్లో సక్సెస్..

కోతుల్లో సక్సెస్..

కాగా, ChAdOx1 nCov-19 టీకాను తీసుకున్న ఆరు రీసెన్(ఆసియా జాతి) కోతులు వైరస్‌ను నిలువరించాయి. అమెరికాలోని మాన్టానలోని రాకీమౌంటెన్‌లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు నిర్వహించారు. దీంతో ఈ టీకా సత్ఫలితాలను ఇస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ దశలే కీలకం..

ఈ దశలే కీలకం..


ఇప్పటికే మనుషులపై మొదటి దశ టీకా ప్రయోగాలు పూర్తి కాగా, రెండో దశ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ ప్రయోగాల్లో రెండు, మూడు దశలే కీలకం కానున్నాయి. వీటి ఫలితాలు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రయోగాల్లో పాల్గొనేవారిలో కొందరికి కరోనావైరస్ కోసం తయారు చేసిన ChAdOx1 nCov-19 టీకాను, మిగిలిన వారికి MenACWY అనే టీకాను ఇస్తారు. అయితే, ఎవరికి ఏ టీకా ఇచ్చింది బయటకు చెప్పారు. MenACWY అనేది ఒక రకమైన మెనుంజైటీస్‌కు కారణమయ్యే ఏ, సీ, డబ్ల్యూ, వై అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కారణం కాకుండా బ్రిటన్‌లో వాడే ఒక టీకా.

English summary
Researchers linked to the University of Oxford's COVID-19 vaccine are hoping to recruit over 10,000 healthy participants for the imminent next phases of their human clinical trials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X