వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విరుగుడుకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ల్యాబోరేటరీల్లో నిరంతర ప్రయోగాల్లో మునిగిపోయారు. వైరస్ జన్యువును విశ్లేషించి.. దానికి విరుగుడు తయారుచేయడంలో వారంతా తలమునకలయ్యారు. అయితే ఎంత వేగంగా ప్రయోగాలు సాగించినా.. వ్యాక్సిన్ తయారీకి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బ్రిటన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హన్‌కాక్ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ గ్రూప్,జెన్నెర్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్నాయని చెప్పారు.అంతేకాదు,గురువారం(ఏప్రిల్ 23) నుంచి మనుషులపై దీన్ని ప్రయోగించబోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం..

కరోనాకు విరుగుడు.. ChAdOx1 nCoV-19..

కరోనాకు విరుగుడు.. ChAdOx1 nCoV-19..

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ గ్రూప్,జెన్నెర్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా అభివృద్ది చేస్తున్న ఈ వ్యాక్సిన్‌కు ChAdOx1 nCoV-19 అని నామకరణం చేశారు. 'అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టార్' టెక్నాలజీ ఆధారంగా దీన్ని అభివృద్ది చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కరోనా వైరస్ ఆర్ఎన్ఏ జన్యువును అడెనోవైరస్‌(కామన్ వైరస్‌లు)లోకి ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని తిరిగి మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ చేయవచ్చు. అప్పుడు అడెనోవైరస్ వ్యాక్సిన్ కోడ్స్ లేదా వ్యాక్సిన్ కెమికల్స్‌కు వెక్టార్‌(క్యారియర్)గా పనిచేస్తుంది. కాబట్టి దానిని అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టార్ అని పిలుస్తారు.

ఎలా పనిచేస్తుంది..

ఎలా పనిచేస్తుంది..

కరోనా వైరస్ బాహ్య అంచులపై గుండ్రటి ముళ్ల(స్పైక్స్) లాంటి ఆకారాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్‌లతో నిర్మింపబడి ఉంటాయి. తాజాగా అభివృద్ది చేస్తున్న ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఈ స్పైక్స్‌ను టార్గెట్ చేస్తుంది. ఒక్కసారి ఈ వ్యాక్సిన్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే.. అది కరోనా వైరస్ లాంటి యాంటిజెన్స్(స్పైక్స్)ను వృద్ది చేస్తుంది. ఇవి అచ్చు కరోనా స్పైక్స్‌నే అనుకరిస్తాయి. మానవ శరీరం ఈ స్పైక్స్‌ను గుర్తించిన వెంటనే యాంటీబాడీస్(ప్రతినిరోధకాలు)ను విడుదల చేయడం మొదలుపెడుతుంది. ఈ యాంటీబాడీస్ ఆ స్పైక్స్‌పై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. అంతేకాదు, ఈ స్పైక్స్‌పై దాడి చేయడానికి రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను ఎప్పుడూ సిద్దంగా ఉంచుకుంటుంది.

క్లినికల్ ట్రయల్స్

క్లినికల్ ట్రయల్స్

ఒకవేళ నిజమైన వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. వెంటనే యాంటీబాడీస్ విడుదలై.. కరోనా వైరస్‌పై పోరాడుతాయి. ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇంకా అభివృద్ది దశలోనే ఉన్న ఈ వ్యాక్సిన్‌తో బ్రిటన్‌లోని పలుచోట్ల ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 550 మంది వలంటీర్లను బ్రిస్టల్,సౌతాంప్టన్,లండన్ ప్రాంతాల నుంచి రిక్రూట్ చేసుకున్నారు.

Recommended Video

Watch : లాక్ డౌన్ లో రోడ్లపై తిరిగే వాళ్ళకి కొత్త పద్ధతిలో బుద్ధి చెప్తున్న మహారాష్ట్ర పోలీసులు!

English summary
The vaccine is based on an 'adenovirus vaccine vector' technology. Here the coronovirus genetic (RNA) information is injected into the adenoviruses (common viruses) to mimic as coronovirus. This modified adenovirus can be injected into the body. Since the adenovirus acts as vector (carrier) of the vaccine codes or vaccine chemicals into the body, it is called 'adenovirus vaccine vector'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X