• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యాక్సిన్ గుడ్‌న్యూస్: ఈ ఏడాదిలోనే - ఆస్ట్రాజెనెకా అనూహ్య ప్రకటన - ట్రయల్స్ నిలిపేతపై సీఈవో వివరణ

|

కొవిడ్-19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం వివిధ దేశాలు, పలు సంస్థలు ప్రయోగాలను ముమ్మరం చేశాయి. వాటిటన్నింటిలోకి మెరుగైన ఫలితాలు సాధించి, ఫ్రంట్ రన్నర్ గా నిలిచింది ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్. డజనుకుపైగా దేశాల్లో వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ చేపట్టిన ఆస్ట్రాజెనెకా.. రెండ్రోజుల కిందట ట్రయల్స్ ను నిలిపేసింది. యూకేలోలో వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఓ వాలంటీర్ ఆరోగ్యం దెబ్బతినట్లు గుర్తించడంతో అన్ని దేశాల్లోనూ ట్రయల్స్ ను తాత్కాలికంగా ఆపేశారు. కాగా, ఆస్ట్రాజెనికా సీఈవో తాజాగా మరో అనూహ్య ప్రకటన చేశారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్: సీరం సంచలన నిర్ణయం-భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత -డీసీజీఐ నోటీసులతో

ఈ ఏడాది చివరినాటికే..

ఈ ఏడాది చివరినాటికే..

వ్యాక్సిన్ తయారీ దశలో క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోవడం సహజంగా జరిగేదే అని, వైరాలజీతో సంబంధమున్న వాళ్లు, సైంటిస్టులు, డాక్టర్లకు తప్ప మిగతా వాళ్లకు దీనిపై అవగాహన తక్కువ కాబట్టే ట్రయల్స్ నిలిపివేతను పెద్ద విషయంగా చూస్తున్నారని ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్ సోరియట్ అన్నారు. బుధవారం ఓ వర్చువల్ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన.. తమ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ను ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనైనా అందుబాటులోకి వస్తుందని, ఆ వెంటనే అనుమతుల కోసం సంబంధిత ఏజెన్సీలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

NEET 2020: నిబంధనల సవరణ - కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గైడ్ లైన్స్ ఇవే..

ఆ వికటించిన కేసు గురించి..

ఆ వికటించిన కేసు గురించి..

బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజమైన ఆస్ట్రాజెనెకా.. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ‘AZD1222' అనే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. కమర్షియల్ గా దానికి ‘కొవిషీల్డ్' పేరుతోనూ వ్యవహరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 50 వేల మందికిపైగా వాలంటీర్లు క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొంటున్నారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం చివరిదైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరింది. అయితే, యూకేలో.. వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఓ వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తడంతో ట్రయల్స్ నిలిపేశారు. కాగా, ఆ వ్యక్తిలో కొత్తగా తలెత్తిన ఆరోగ్య సమస్యలు కొవిడ్ వ్యాక్సిన్ డోసు వల్ల ఉత్పన్నమైనవి కావని రిపోర్టుల్లో వెల్లడైందని, అయినాసరే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వచ్చాయనేదానిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని, తుది రిపోర్టులను సంబంధిత ఏజెన్సీలకు సమర్పించిన తర్వాతే క్లినికల్ ట్రయల్స్ మళ్లీ కొనసాగిస్తామని ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్ వివరించారు.

ఇండియాలోనూ ట్రయల్స్ నిలిపివేత..

ఇండియాలోనూ ట్రయల్స్ నిలిపివేత..

ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ కలిసి రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో భాగస్వామిగా ప్రఖ్యాత సీరం ఇనిస్టిట్యూట్ వ్యవహరిస్తున్నది. ఇండియాలో 17 ప్రాంతాల్లో సీరం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లినికల్ ట్రయల్స్ లో వేల మంది వాలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. అయితే, యూకే సహా ఇతర దేశాల్లో ట్రయల్స్ ను నిలిపేసిన తర్వాత కూడా భారత్ లో ట్రయల్స్ కొనసాగించడంపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ సేఫ్టీపై తక్షణమే వివరణ వివరణ ఇవ్వాలని డీసీజీఐ నోటీసులు జారీచేయడంతో సీరం సంస్థ ఇక్కడ కూడా ట్రయల్స్ ను నిలిపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. షోకాజ్ నోటీసులకు సీరం ఇచ్చే వివరణను బట్టి ట్రయల్స్ పునరుద్ధరణపై డీసీజీఐ తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది.

English summary
AstraZeneca should still know before the end of the year whether its experimental vaccine protects people against COVID-19, the drugmaker's chief executive Pascal Soriot said on Thursday, as long as it can resume trials soon. The British company suspended late-stage trials this week after an illness in a participant in Britain. The patient was reportedly suffering from symptoms associated with a rare spinal inflammatory disorder called transverse myelitis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X