వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీచ్ ను కమ్ముకున్న విష మేఘాలు: 233 మంది ఆసుపత్రి పాలు

బీచ్‌లో సేద తీరుతున్న ప్రజలను క్లోరిన్‌ వాయు మేఘాలు తాకడంతో కళ్ల మంటలు, గొంతు రాజుకుపోవడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు తలెత్తిన ఘటన ఇంగ్లండ్‌లోని ఈస్ట్‌ ససెక్స్‌లో కలకలం రేపింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బ్రిటన్: క్లోరిన్‌ వాయు మేఘాలు ఇంగ్లండ్‌లోని ఈస్ట్‌ ససెక్స్‌లో కలకలం రేపాయి. బీచ్‌లో సేద తీరుతున్న ప్రజలను విష వాయువు తాకడంతో కళ్ల మంటలు, గొంతు రాజుకుపోవడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని 233 మందికి పైగా బాధితులను అంబులెన్స్‌ల సాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 Packed tourist hotspot Beachy Head evacuated and 238 people ‘decontaminated’ in hospital

ఒక్కసారిగా వచ్చిన విష వాయు మేఘం నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చిందని బీచ్‌లోని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఆ వాయువు పీల్చుకున్న ప్రతి వ్యక్తి ఏదో రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పారు. కాగా, ఆసుపత్రికి తరలించిన బాధితులకు డాక్టర్లు ప్రత్యేక సూట్లు వేసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు.

విష వాయువును పీల్చుకున్న వ్యక్తి నుంచి వెలువడే గాలి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. బీచ్‌ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీచ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

క్లోరిన్‌ వాయువు బీచ్‌ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారులు ఈ కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. అలాంటిది జరిగే కచ్చితంగా ఆధారాలు లభ్యమవుతాయన్నారు. గ్యాస్‌ ఎక్కడి నుంచి వెలువడిందనే దానికి అసలు ఆధారాలేవి ఇప్పటివరకూ లభ్యం కాలేదని చెప్పారు.

English summary
Hundreds more beachgoers were left suffering stinging eyes and breathing difficulties after fleeing the East Sussex coast this afternoon. Eastbourne District General Hospital was forced to declare a "major incident" as staff in hazmat suits and treated inside pop-up "decontamination" tents. Witnesses have reportedly said patients were made to change clothes and hosed down as an extra precaution, according to MailOnline. Dramatic pictures show the unusual smog lingering above the sea before moving inland towards revellers enjoying the Bank Holiday weekend weather at about 5pm on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X