వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుస్సాహసానికి దిగితే: భారత్‌కు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్ మరోసారి భారత్ పైన అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దుల్లో పాక్ నిత్యం ఆగడాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం, మంగళవారం కూడా దుండగులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి గట్టిగా సమాధానం చెబుతామని భారత్ స్పందించింది.

ఇప్పటికే మరణశిక్ష, కుల్‌భూషణ్ జాదవ్‌పై మరో కేసు పెట్టిన పాకిస్తాన్ఇప్పటికే మరణశిక్ష, కుల్‌భూషణ్ జాదవ్‌పై మరో కేసు పెట్టిన పాకిస్తాన్

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖుర్రం దస్తగిర్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ దుస్సాహసానికి దిగితే ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాదులోని అధ్యక్ష భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

Pak Defence Minister warns India against any 'misadventure'

'దుస్సాహసం చేసే వారికి ఉంది. దీనికి ప్రతిస్పందించే హక్కు మాకు ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత తీవ్రతతో ఉంటుందన్నది మాకు సంబంధించిన అంశం' అని భారత్‌ను ఉద్దేశించి అన్నారు.

2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని చెప్పారు. కాశ్మీర్‌లో మానవత్వానికి వ్యతిరేకంగా భారత దళాలు నేరాలకు పాల్పడుతున్నాయని అనుచిత ఆరోపణలు చేశారు.

English summary
Pakistan's Defence Minister Khurram Dastagir has warned India of a "response" in case of a misadventure by it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X