వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మాస్వరాజ్‌పై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షాకింగ్ కామెంట్స్, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

లాహోర్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పైన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కర్తార్‌పూర్ నడవాకు పాకిస్తాన్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఆపేంద వరకు పాకిస్తాన్‌తో ఎలాంటి చర్యలు జరపమని తేల్చి చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అయిన ఖురేషి స్పందించారు. చర్చలు జరపబోమని చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వయస్సులో సుష్మా స్వరాజ్ సిగ్గుపడుతున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో చర్చలకు తాము సుముఖంగా ఉన్నామని, ఆ దేశమే ముందుకు రావడం లేదన్నారు.

Pak FM Qureshi makes shocking comment about Sushma Swarajs age

ఇదే విషయమై భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పారు. న్యూయార్క్ భేటీని కూడా రద్దు చేసిందన్నారు.

పాకిస్తాన్ భారత దేశంపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. ప్రతి అంశంలోకి భారతదేశానికి చెందిన కాశ్మీర్ అంశాన్ని లాగుతోంది. దీంతో భారత్ కూడా ధీటుగా సమాధానం చెబుతోంది.

ఇటీవల సుష్మా స్వరాజ్ హైదరాబాదులో మాట్లాడాతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపేంత వరకు సార్క్ సదస్సులో పాల్గొనబోనని చెప్పారు.

భారత్ యాత్రికులు పాకిస్తాన్‌లోని గురుద్వారాను దర్శించుకునేందుకు వీలుగా కర్తార్‌పూర్ కారిడార్ అభివృద్ధికి, ద్వైపాక్షిక చర్చలకు సంబంధం లేదని సుష్మా స్వరాజ్ చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహం ఆగిపోయినప్పుడే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని చెప్పారు. ద్వైపాక్షిక చర్చలు, కర్తార్‌పూర్ నడవా వేర్వేరు అంశాలు అన్నారు. గత ఇరవై ఏళ్లుగా ఈ కారిడార్‌కు సహకరించాలని భారత్ కోరుతోందని, పాకిస్తాన్ ఇప్పుడు స్పందించిందన్నారు.

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం ఈ నడవాకు పాకిస్తాన్‌లో శంకుస్థాపన చేశారు. తొలుత ఈ కార్యక్రమానికి మంత్రి సుష్మా స్వరాజ్‌ను, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను, మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూను ఆ దేశ విదేశీ మంత్రి ఖురేషీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని సుష్మా, అమరీందర్‌ సింగ్‌ తిరస్కరించారు.

బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారత్‌ నుంచి కేంద్రమంత్రులు హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, హర్‌దీప్‌ సింగ్‌ పూరీ, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌సిద్దూ హజరయ్యారు.

English summary
Pakistan foreign minister Shah Mehmood Qureshi has made a jibe at External Affairs Minister Sushma Swaraj, in a derogatory statement that could be termed misogynistic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X