• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్ళికి ఒప్పుకోలేదని గర్బవతిని చేశాడు, నిందితుడికి సహకరించిన సోదరి

By Narsimha
|

ఇస్లామాబాద్:తనతో వివాహనికి ఒప్పుకోలేదని 17 ఏళ్ళ బాలికపై బలవంతంగా అత్యాచారం చేశాడు.దీంతో ఆ బాలిక గర్భవతి అయింది.ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకొంది.

17 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె తన మేనమామ ఇంట్లో నివాసం ఉండేది.అయితే మేనమామ భార్య తమ్ముడు ఈ బాలికను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయితే ఈ ప్రతిపాదనను ఆ బాలిక మాత్రం వ్యతిరేకించింది.

Pak man rapes, impregnates 17-yr-old for rejecting marriage proposal

ఎప్పుడైతే తన వివాహ ప్రతిపాదనకు ఆ బాలిక తిరస్కరించిందో ఆ తర్వాతే ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ నిందితుడు. అయితే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేందుకుగాను మేనమామ భార్య కూడ సహకరించేది. వారిద్దరిని ఒకే గదిలోకి పంపించి బయటనుండి గడియ వేసేదని బాధితురాలు చెప్పారు.

బాలికపై 2016 మే మాసంలో బాలికపై అత్యాచారం జరిగింది.అయితే ఈ విషయం మాత్రం వెలుగు చూసింది ఈ ఏడాది జనవరి మాసంలో.బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతి అయింది.ఆమె గర్భవతి అయిన విషయం బయటకు రావడంతో అసలు విషయం వెలుగు చూసింది.

గర్భం దాల్చిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మేనమామ ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకొంది. అయితే ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలు చెబుతోంది.

గర్భం దాల్చిన తర్వాత పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో బాలికకు డిఎన్ ఏ పరీక్షలు నిర్వహించారు. ఆ బాలిక ప్రస్తుతం 7 మాసాల గర్భవతిగా తేలిందని వైద్యులు ప్రకటించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేనమామ భార్య, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
A Pakistani man has been arrested for allegedly raping and impregnating a 17-year-old orphan girl after she rejected his marriage proposal.The assault took place in May 2016, but the incident came to light only after the girl was unable to hide the resultant pregnancy and had to report the matter to the Ramna Police Station in January 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more