వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్మారాలో పైసలు పాయే.. అంగట్లో పరువు పాయే... ఇదీ పాకిస్థాన్ పరిస్థితి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పైన హెడ్డింగ్ ఉన్నట్టు ఉంది పాకిస్థాన్ పరిస్థితి. ఎందుకంటారా ? ఇటీవల కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఆ దేశం ఘోర పరాభావాన్ని చవిచూసింది. అయితే ఆ కేసును వాదించిన భారత్ తరఫు లాయర్ హరీష్ సాల్వే .. కేవలం నామమాత్రంగా రూపాయి ఫీజు తీసుకొని తన దేశభక్తిని చాటుకున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్ లాయర్ మాత్రం బీరాలు పోయారు. కానీ అతడు వసూల్ చేసిన ఫీజుపై సర్వత్రా చర్చ జరుగుతుంది.

పేరు గొప్ప ..

పేరు గొప్ప ..

జాదవ్ ఉరిశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ వాదనలు వినిపించింది. తాము విధించిన శిక్ష సరైనదేనని పాక్ .. చెప్పాల్సి ఉంది. ఇందుకోసం పాకిస్థాన్‌లో ప్రముఖ లాయర్ ఖవార్ ఖురేసీని సంప్రదించింది. అతను కేసును వాదించారు. కానీ ఓడిపోయింది. ఇంతవరకు ఓకే కానీ అతను ఫీజు గురించే చర్చ జరుగుతుంది. జాదవ్ కేసులో వాదనలు వినిపించేందుకు అతను వసూల్ చేసింది ఎంతో తెలుసా.. అక్షరాల 20 కోట్లు. ఔను మీరు విన్నది నిజమే.

సర్వత్రా విమర్శలు ..

సర్వత్రా విమర్శలు ..

ఇంత ఫీజు తీసుకున్న ఖురేషీ బలమైన వాదనలు వినిపించారా అంటే అదీ లేదు. కానీ ఫీజు మాత్రం దండిగా తీసుకున్నారు. అయితే ఖురేషీ అల్లటప్ప లాయరేమి కాదు. 1993లోనే అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించి .. రికార్డు సృష్టించారు. కానీ జాదవ్ కేసులో మాత్రం ఓడిపోయారు. దీంతో పాకిస్థాన్ మీడియా ఖురేషీని తప్పుపడుతూ విమర్శలు చేస్తోంది. అంతేకాదు ఖురేషీకి ఇచ్చిన 90 నిమిషాల సమయాన్ని కూడా సరిగా వినియోగించుకోలేదని దుమ్మెత్తిపోస్తుంది.

ఇదీ సాల్వే ఘనత ...

ఇదీ సాల్వే ఘనత ...

మాజీ నేవి అధికారి జాదవ్‌ బలూచిస్థాన్‌లో ఉగ్రవాద చర్యలు పాల్పడుతున్నారని పాకిస్థాన్ మిలిటరీ అరెస్ట్ చేసింది. ఉరిశిక్ష విధించడంతో భారత్ తీవ్రంగా ప్రతిఘటించింది. అంతర్జాతీయ కోర్టులో వాదనలు వినిపించింది. ఇందుకోసం ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేని ఎంపికచేసింది. సాల్వే రాజ్యాంగానికి సంబంధించి, కమర్షియల్ టాక్స్ లా గురించి మంచి పట్టుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైన క్రిమినల్ కేసులను కూడా వాదించారు. దాంతోనే 2017లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ .. అంతర్జాతీయ న్యాయస్థానంలో బలంగా తన వాదనలను వినిపించారు. సాల్వే వాదనలతో న్యాయమూర్తుల బృందం ఏకీభవించి .. తీర్పును పున:సమీక్షించాలని స్పష్టంచేసింది.

ఇదీ నేపథ్యం ..

ఇదీ నేపథ్యం ..

1955 జూన్ 22న ఎన్‌కేపీ సాల్వే దంపతులకు మరాఠీ కుటుంబంలో జన్మించారు హరీష్ సాల్వే. ఆయన తండ్రి సీఏగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నేతగా గుర్తింపు పొందారు. హరీష్ తల్లి .. అంబ్రిత్.. వైద్యురాలు. హరీశ్ తాత కూడా క్రిమినల్ లాయర్‌గా పనిచేశారు. తండ్రి మీద ప్రభావంతో సీఏ చేశారు హరీశ్. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో న్యాయవాద ప్రొఫెషన్‌లో అడుగిడారు. వివిధ హైకోర్టుల్లో కేసులు వాదించారు. తర్వాత సుప్రీంకోర్టు కేసులు .. రాజ్యాంగ సంబంధ కేసులు, టాక్స్ కేసులు విచారంచి మంచి పేరుతెచ్చుకున్నారు. 1999 నుంచి 2002 వరకు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. న్యాయవాద వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్న సాల్వే ..2017లో దేశంలో అత్యంత ప్రభావశీల 50 మంది వ్యక్తుల్లో సాల్వేకు ఇండియా టుడే 43 స్థానం కట్టబెట్టింది.

English summary
India has appealed in international court challenging Jadhav's execution. Pak has to say that the punishment they have imposed is correct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X