వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా -పాక్ ప్లాన్: భారత్‌పై అణుయుద్ధం - ముస్లింలపై పడకుండా బాంబులేస్తాం - పాక్ మంత్రి ప్రేలాపన

|
Google Oneindia TeluguNews

దాయాది పాకిస్తాన్ పూర్తిగా డ్రాగన్ చైనా పాదాక్రాంతమైపోయింది. పాకిస్తాన్ భవిష్యత్తు చైనాతో సంబధాలపైనే ఆధారపడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ గురువారం చైనాకు బయలుదేరివెళ్లారు. చైనా అండ చూసుకుని ప్రేలాపనలకు దిగిన పాక్ మంత్రి ఒకరు భారత్ పై అణు యుద్ధం చేస్తామని హెచ్చరికలు చేశారు. మరోవైపు, సౌదీ అరేబియాతో చెడినవేళ, చైనాకు మరింత దగ్గరయ్యేలా విదేశాంగ మంత్రి ఖురేషీ కీలక పర్యటన ప్రారంభించారు.

Recommended Video

పాక్ కి హ్యాండిచ్చిన PepsiCo, స్పాన్సర్ల వేట లో PCB || Oneindia Telugu

ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - 'కమ్మ'కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - 'కమ్మ'కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్

ఇక్కడ పేల్చితే అస్సాం బుగ్గి..

ఇక్కడ పేల్చితే అస్సాం బుగ్గి..

ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ లో రైల్వే మంత్రిగా పనిచేస్తోన్న షేక్ రషీద్ కు ‘కరడుగట్టిన ఐఎస్ఐ సమర్థకుడి'గా పేరుంది. తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏమాత్రం తేడా వచ్చినా ఇండియాపై అణుబాంబులు వేస్తామని బెదిరించారు. తమ దగ్గరున్న అణు బాంబులు సైజులో చిన్నవే అయినా, తీవ్ర ప్రభావాన్ని చూపించగలవని, ఇస్లామాబాద్ లో మీట నొక్కితే, ఇండియాలోని అస్సాం కూడా బుగ్గిపాలవుతుందని అన్నారు.

ముస్లింలపై పడకుండా..

ముస్లింలపై పడకుండా..

‘‘పాకిస్తాన్ ఆర్మీ కంటే ఇండియన్ ఆర్మీ సైజులో, సామర్థ్యంలో చాలా పెద్దదన్న విషయం మాకు తెలుసు. సంప్రదాయ యుద్ధంలో ఇండియాన్ పాక్ ఓడించలేదని కూడా మేం ఒప్పుకుంటాం. అందుకే ఈసారి ఏమాత్రం తేడాలొచ్చినా అణుయుద్ధానికి దిగుతాం. అస్సాం లాంటి సూదూర ప్రాంతాలను కూడా మేం టార్గెట్ చేయగలం. అయితే, ముస్లింలపై పడకుండా, వాళ్ల సముదాయాలు దెబ్బతినకుండా అతి జాగ్రత్తగా బాంబులు వేస్తాం'' అని పాక్ మంత్రి రషీద్ బాహాటంగా వ్యాఖ్యానించారు. ఆయన వివాదాస్పద ఇంటర్వ్యూ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే..

ఎస్పీ చరణ్ కన్నీటిపర్యంతం - ఎస్పీ బాలు కండిషన్ పై తాజా వీడియో - ఆ 5 నిమిషాలు..ఎస్పీ చరణ్ కన్నీటిపర్యంతం - ఎస్పీ బాలు కండిషన్ పై తాజా వీడియో - ఆ 5 నిమిషాలు..

ఛీకొట్టిన ఇస్తామిక్ ప్రపంచం..

ఛీకొట్టిన ఇస్తామిక్ ప్రపంచం..

పాక్ మంత్రి రషీద్ ఇండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కానప్పటికీ, కాశ్మీర్ విషయంలో ఇస్లామిక్ ప్రపంచంమంతా పాక్ ను ఛీకొట్టిన వేళ దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రషీద్ మళ్లీ తెరపైకి వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ - సౌదీ అరేబియా మధ్య సంబంధాలు క్షీణించాయి. కశ్మీరు సమస్యపై చర్చించేందుకు ఇస్లామిక్ దేశాల సంఘం (ఓఐసీ) భేటీ కావాలన్న పిలుపునకు సౌదీ స్పందించకపోవడంపై పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ మండిపడ్డారు. ఈ పరిణామాన్ని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్ సీరియస్ గా తీసుకున్నారు. పాక్ కు ఆయిల్ సరఫరా నిలిపేస్తామనీ సౌదీ హచ్చరించింది. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను కలిసేందుకు క్రౌన్ ప్రిన్స్ నిరాకరించారు. దీంతో పాక్ మళ్లీ చైనా బాటపట్టింది..

బీజింగ్ బయల్దేరిన ఖురేషీ..

బీజింగ్ బయల్దేరిన ఖురేషీ..

చైనాతో వ్యూహాత్మక సంబంధాలు పెంచుకోవడంలో భాగంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి గురువారం బీజింగ్ కు బయలుదేరారు. రాజకీ, ఆర్థిక రంగాల్లో పాకిస్తాన్ కు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన నిజమైన స్నేహితురాలు చైనాయే అన్న ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఖురేషి చైనా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా విదేశాంగ మంత్రి సహా దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరపనున్న ఖరేషీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ను పాక్ పర్యటనకు ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అలాగే...

భారత్ - చైనా మధ్యలో పాక్..

భారత్ - చైనా మధ్యలో పాక్..

కాశ్మీర్ అంశంలో జోక్యానికి ఇస్లామిక్ దేశాలు నిరాకరించిన వేళ చైనా ఖురేషీ చైనా మద్దతు కోరనున్నారు. కాశ్మీర్ అంశంతోపాటు తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపైనా ఆయన చర్చలు చేయనున్నట్లు తెలుస్తోంది. పాక్ అప్పుగా తీసుకున్న 3 బిలియన్‌ డాలర్లను వెంటనే చెల్లించాలని సౌదీ అరేబియా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో చైనా ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించేలా పాక్ పావులు కదుపుతున్నది. ఇండియాను ఇబ్బందిపెట్టేలా తాను వ్యవహరించి, తద్వారా చైనా నుంచి లబ్దిపొందడమే ఖురేషీ బీజింగ్ పర్యటన లక్ష్యంగా తెలుస్తోంది.

English summary
In an interview, Sheikh Rasheed admitted that the Indian Army is far superior to the Pakistan Army in conventional warfare, therefore, Pakistan is working on miniaturised nuclear weapons. other side, Pakistan foreign minister Makhdoom Shah Mehmood Qureshi is leaving for Beijing for ‘strategic level’ discussions with his Chinese counterparts on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X