వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీత: మోడీ ఇస్తానన్నరూ.కోటి వద్దన్న పాక్ ఈది సంస్థ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత్‌కు చెందిన గీతను ఏళ్ల పాటు సంరక్షించిన పాకిస్తాన్‌కు చెందిన ఎన్జీవో ఈదీ ఫౌండేషన్ మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వజూపిన రూ.కోటిని తిరస్కరించింది. గత పదిహేనేళ్లుగా గీతకు ఈది ఫౌండేషన్ గీతకు ఆశ్రయమిచ్చిన విషయం తెలిసిందే.

గీత సోమవారం నాడు భారత్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల పాటు గీతకు ఆశ్రయమిచ్చిన ఈదీ ఫౌండేషన్‌కు ప్రధాని మోడీ రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. అయితే ఈ విరాళాన్ని ఈదీ ఫౌండేషన్‌ సున్నితంగా తిరస్కరించింది.

Pak NGO Edhi Foundation That Took Care of Geeta Rejects PM Modi's 1 Crore Gift

ఎంతో గొప్పమనసుతో ప్రధాని మోడీ తమకు ఆర్థిక సాయం ప్రకటించారని, అయితే తమ స్వచ్ఛంద సంస్థ నియమం ప్రకారం, ఏ ప్రభుత్వం నుంచి తాము సాయం అందుకోబోమని ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి అన్వర్‌ ఖజ్మీ తెలిపారు.

పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కూడా తాము ఎలాంటి నగదు సాయం తీసుకోబోమన్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన ఆ విరాళాన్ని భారత్‌లోని మూగ, బధిర చిన్నారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన భారత్‌కు చెందిన గీత స్వదేశానికి చేరుకుంది.

చిన్న వయసులో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో కూర్చుని ఉన్న మూగ, బధిర బాలిక గీతను లాహోర్‌ రైల్వే స్టేషన్‌లో పాకిస్థానీ రేంజర్లు కనుగొని స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఏళ్లుగా గీత కరాచీలోని ఈదీ ఫౌండేషన్‌ సంరక్షణలో ఉంది.

English summary
Pakistan NGO Edhi Foundation That Took Care of Geeta Rejects PM Modi's 1 Crore Gift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X