వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లో అణ్వాయుధాల తయారీ, 9 చోట్ల స్థావరాలు, చైనా సహకారం? పసిగట్టిన అమెరికా!

పాకిస్తాన్ మరో ఉత్తర కొరియా కానుందా? రహస్యంగా తెలియకుండా అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందా? ఉత్తర కొరియా, పాకిస్తాన్ లకు మూడోకంటికి తెలియకుండా చైనా సహకారం అందిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రస్తుతం అవుననే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌ ఒకవైపు ఉత్తరకొరియా దుందుడు చర్యలతో అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాలు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ కూడా ఉత్తరకొరియా బాటలోనే ప్రయాణిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది.

పాకిస్తాన్ మరో ఉత్తర కొరియా కానుందా? రహస్యంగా తెలియకుండా అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందా? ఉత్తర కొరియా, పాకిస్తాన్ లకు మూడోకంటికి తెలియకుండా చైనా సహకారం అందిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రస్తుతం అవుననే సమాధానాలు వస్తున్నాయి.

ఆసియాలో అణ్వాయుధ పోటీ?

ఆసియాలో అణ్వాయుధ పోటీ?

ఆసియాలో మరోసారి అణ్వాయుధ పోటీకి పాకిస్తాన్‌ తెరతీస్తోందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో పాకిస్తాన్‌ అణ్వాయుధాల తయారీ చేస్తోందని అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఉగ్రవాదానికి తోడు అణ్వాయుధాలు..

ఉగ్రవాదానికి తోడు అణ్వాయుధాలు..

ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరంగా మరింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు పులిమీద పుట్రలా పాకిస్తాన్ మరిన్ని అణ్వాయుధాలు రూపొందిస్తే పరిస్థితులు భయానకంగా ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూక్లియర్ వార్‌హెడ్ల రూపకల్పనలో...

న్యూక్లియర్ వార్‌హెడ్ల రూపకల్పనలో...

ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్టుల అంచనా ప్రకారం.. పాకిస్తాన్‌ 130-140 న్యూక్లియర్‌ వార్‌హెడ్లను రూపొందించే పనిలో పడింది. వీటిని వీలైనంత త్వరగా తయారు చేసి.. సైన్యానికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోందట. మరి పాకిస్తాన్ టార్గెట్ ఎవరు? భారత్ ను బెదిరించేందుకే పాకిస్తాన్ ఈ అణ్వాయుధ తయారీ కార్యక్రమం చేపట్టిందా?

ఎక్కడెక్కడ తయారుచేస్తోంది?

ఎక్కడెక్కడ తయారుచేస్తోంది?

పాకిస్తాన్‌.. దేశంలోని 9 ప్రాంతాల్లో అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో పంజాబ్‌ ప్రావిన్స్‌లో 4, సింధ్‌ ప్రావిన్స్‌లో 3, బలూచిస్తాన్‌లోని 2 కేంద్రాల్లో ఈ ఆయుధాలు రూపొందుతున్నాయని వారు పేర్కొన్నారు. పాకిస్తాన్ అణ్యాయుధ సంపత్తి పెంచుకోవడంలో చైనా పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరకొరియాకు సహకారం అందించనట్లుగానే చైనా లోలోపల పాకిస్తాన్ కు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలా గుర్తించారంటే...

ఎలా గుర్తించారంటే...

పాకిస్తాన్‌లో అణ్వాయుధాల తయారీ జరుగుతోందన్న అనుమానాలు కొద్దిగా కాలంగా ఉన్నట్లు ఎఫ్‌ఏసీ సైంటిస్టులు తెలిపారు. కమర్షియల్‌ శాటిలైట్లు అందించిన ఛాయాచిత్రాలు, నిపుణుల పరిశోధనలు, స్థానిక పత్రికల్లో ఇచ్చే వార్తల అధారంగా వీటిని గుర్తించినట్లు చెప్పారు. అంతేకాక సెప్టెంబర్‌ 20న పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ భారత్‌లోని ఏ నగరాన్ని అయినా మేం చేరుకోగలం అని చేసిన ప్రకటన కూడా తమ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చిందని వారు తెలిపారు.

ఇవీ ఆ కేంద్రాలు...

ఇవీ ఆ కేంద్రాలు...

పాకిస్తాన్‌ ఎక్కడెక్కడ అణ్వాయుధ తయారీ సాగిస్తుందో.. ఆయా కేంద్రాల వివరాలపై కూడా శాస్త్రవేత్తలు ఎం.కిర్‌స్టన్‌, రాబర్ట్‌ ఎస్‌. నోరిస్‌ లు ఒక అంచనాకు వచ్చారు. సింధ్ లోని ఆక్రో గారిసన్ వద్ద అండర్‌గ్రౌండ్‌లో పాకిస్తాన్ తన అణ్వాయుధాలను దాచిపెడుతోందట. అలాగే పంజాబ్ లోని గుజ్రన్వాలా గారిసన్ ప్రాంతంలో కూడా ఆయుధాలను నిల్వ చేస్తోందట.
బలూచిస్తాన్‌ లోని ఖుజ్దార్‌ గారిసన్ ప్రాంతంలో భూగర్భంలో ఆయుధాలను నిల్వ చేసుకునే అవకాశం ఉందట. ఇక కరాచీలోని మస్రూర్ డిపార్ట్ మెంట్ లో శక్తివంతమైన బాంబులను నిల్వ చేసుకోవచ్చట. పంజాబ్‌ లోని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ ఎస్‌ఎస్‌ఎమ లాంచర్‌ అసెంబ్లీ, వార్‌హెడ్ల తయారీ,నిల్వ చేస్తుందట. సింధ్ లోని పానో అకిల్ గిరిసన్ వద్ద ఆయుధాలను నిల్వ చేసుకోవచ్చట. పంజాబ్‌ లోని సర్గోదా డిపార్ట్‌మెంట్‌ వద్ద శక్తివంతమైన బాంబులను నిల్వ చేసుకోవచ్చని, ఇక్కడికి దగ్గరలోనే ఎఫ్‌-16 యుద్ధవిమానాలు కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అలాగై ఖైబర్ లోని తర్బాలా అండర్‌గ్రౌండ్‌ డిపార్ట్‌మెంట్‌ లో శక్తివంతమైన వార్‌మెడ్లను నిల్వ చేస్తారట. ఇంకా పంజాబ్ లోని వాహ్‌ ఆర్డినెన్స్‌ ఫెసిలిటి వద్ద వార్‌హెడ్ల తయారీ, నిల్వకు అవకాశం ఉందట.

ఉగ్రవాదుల చేతుల్లో పడితే...

ఉగ్రవాదుల చేతుల్లో పడితే...

పాకిస్తాన్ తయారుచేస్తున్న అణ్వాయుధాలు కేవలం భారత్ ను బెదిరించడానికేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ మరింత అజ్యం పోస్తోంది. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆ దేశానికి సరైన పట్టులేదనే అనుమానాలు పొడచూపుతున్న నేపథ్యంలో ఈ అణ్వాయుధాలే గనుక ఉగ్రవాదుల చేతుల్లో పడితే ఏమవుతుంది? ప్రపంచానికే పెనుముప్పు వాటిల్లదూ?

English summary
Pakistan PM Shahid Khaqan Abbasi last week yet again flaunted his country's tactical or nonstrategic nuclear weapons, saying they were meant to deter the Indian Army's 'cold start' doctrine. While Abbasi declared that Pakistan's nuclear assets, including the tactical nukes, were under a robust command-and-control system, the short-range weapons meant to be used early in a conventional conflict with India are vulnerable to accidents and risk of landing up with terrorists. According to a recent report by the Federation of American Scientists (FAS), Pakistan has stored its nuclear forces at nine different locations across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X