వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ దారుణంగా అణచివేస్తోంది: పాక్ ప్రధాని అబ్బాసి అక్కసు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత్‌పై పాకిస్థాన్ మరోసారి తన అక్కసును వెల్లగక్కింది. జమ్మూకాశ్మీర్‌లో భారత్ దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోందని పాకిస్థాన్ ప్రధాని షహీద్ ఖఖన్ అబ్బాసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కాశ్మీరు ప్రజలతో భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. వారిని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ధర్నాలు, ఆందోళనలు చేపట్టే వారిపై పెల్లెట్ గన్‌లను ప్రయోగిస్తూ.. అణచివేతకు పాల్పడుతోంది' అని వ్యాఖ్యానించారు.

Pak PM Abbasi accuses India of launching brutal crackdown in Kashmir

అంతేగాక, 'స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఉగ్రవాదులుగా ముద్రవేస్తోంది' అని అబ్బాసీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, నిజనిర్ధారణ కమిటీ ద్వారా కాశ్మీర్‌లోని పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరారు.

కాగా, జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 13మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

English summary
Pakistan Prime Minister Shahid Khaqan Abbasi has accused India of launching a "brutal crackdown" in Kashmir after terror groups suffered a major setback following the killing of 13 terrorists in counter-insurgency operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X