వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌తో భేటీకానున్న ఇమ్రాన్‌ఖాన్‌..! ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన ఎజెండా..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్ : అంర్జాతీయ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉప్పు నిప్పుగా ఉండే ఇద్దరు అగ్ర నాయకులు అనూహ్యంగా భేటీ కాబోతున్నారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ జులై నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ఖాన్‌ ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు.

ఇది పేదల సంక్షేమ బడ్జెట్..! సీతమ్మ పద్దులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని..!! <br>ఇది పేదల సంక్షేమ బడ్జెట్..! సీతమ్మ పద్దులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని..!!

పాకిస్తాన్‌ విదేశాంగ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇమ్రాన్‌ పర్యటనతో ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరి భేటీపై చైనా, భారత్‌తో సహా ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టెర్రరిజంపై పోరాడటానికి అధికారికంగా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నా కానీ పాకిస్తాన్‌ తమ నమ్మకాన్ని వొమ్ముచేసిందని, అమెరికా నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొని దుర్వినియోగం చేస్తోందని ట్రంప్‌ గత సంవత్సరం పాకిస్తాన్‌పై తీవ్రంగా విరుచుకపడిన విషయం తెలిసిందే.

Pak Pm Imran Khan Visit USA 22th July..!!

ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధంలో కూడా ఇరుదేశాలకు బేధాభిప్రాయాలు ఉన్నాయి. తాలిబాన్‌లకు వ్యతిరేకంగా అమెరికా యుద్ధం చేస్తుంటే, పాకిస్తాన్‌ మాత్రం పరోక్షంగా తాలిబాన్‌లకు సహాయ సహకారాలు అందిస్తోందని అమెరికా నాయకులు తరచూ విమర్శిస్తున్నారు. దీంతో ఆమెరికా పాకిస్తాన్‌కు అందించే ఆర్థిక సహాయంలో కోత విధించింది. మరోపక్క అమెరికాతో భారత్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం పాకిస్తాన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ అభ్యర్థన మేరకు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో అమెరికా తన సంపూర్ణ మద్దతు తెలిపింది.

పాకిస్తాన్‌ కూడా అంతర్జాతీయంగా అమెరికాను చికాకు పెట్టెలా ప్రవర్తిస్తోంది. ఒకపక్క చైనా ఇబ్బడిముబ్బడిగా పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెడుతూ, అంతర్జాతీయ వ్యవహారాలలో పాకిస్తాన్‌కు వంతపాడటం, మరోపక్క రష్యాతో పాకిస్తాన్‌ చేసుకుంటున్న సైనిక ఒ‍ప్పందాలు తదితర విషయాలపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వస్తుందని అమెరికా భావిస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుని దినదిన గండంగా రోజువారిగా వ్యవహారాలు నడుపుతున్న పాకిస్తాన్‌కు ఈ పర్యటన ఎంతో కీలకం కానుందని విశ్లేషకులు అంటున్నారు.

English summary
The only answer is that the sensations are registered in international politics. The two top leaders of the Salt Fire are in awe. Pakistani Prime Minister Imran Khan will visit the US in July. Imran Khan is scheduled to meet with US President Donald Trump in Washington on the 22nd of this month. Pakistani foreign officials confirmed this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X