వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ రాజు ప్రత్యేక విమానంలో అమెరికాకు పాక్ ప్రధాని ఇమ్రాన్! అక్కడా ‘కాశ్మీరే’...

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు చెందిన ప్రత్యేక విమానంలో శనివారం అమెరికాకు చేరుకున్నారు. మీరు మా ప్రత్యేక అతిథి.. మీరు మా ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లడం మాకు ఆనందంగా ఉందని ఇమ్రాన్‌ను ఉద్దేశించి సౌదీ రాజు వ్యాఖ్యానించారు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను పాక్ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషీ వెల్లడించారు. శనివారం ఇమ్రాన్ ఖాన్ అమెరికా చేరుకున్నారని, వారం రోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో కాశ్మీర్ అంశాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రస్తావిస్తారని చెప్పుకొచ్చారు.

Pak PM reaches US in saudi crown princes special plane

కాశ్మీర్ అంశంపై మద్దతు ఇవ్వాలంటూ అమెరికా పర్యటన ముందు సౌదీ అరేబియాలో పర్యటించారు ఇమ్రాన్ ఖాన్. సౌదీ రాజు సల్మాన్ అబ్దులజీజ్ ఆల్ సౌద్ తో భేటీ అయ్యారు. కాశ్మీర్ అంశంతోపాటు పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలపై చర్చించుకున్నారు.

ఆ తర్వాత యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లారు. సెప్టెంబర్ 27న జరిగే సమావేశంలో ఇమ్రాన్ ప్రసంగించనున్నారు. మోడీ కూడా ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి, అంతర్జాతీయ శాంతి, భ్రదతల అంశాలను మోడీ ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు.

English summary
Pakistan PM Imran Khan reached the US on saturday on a Special Aircraft of Saudi Crown Prince, Mohammad bin Salman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X