వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దేశంలోనే అత్యంత బరువైన వ్యక్తి..ఇంట్లో నుంచి బయటకు ఎలా తెచ్చారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

లాహోర్ : పాకిస్తాన్‌ అత్యంత భారీ బరువుతో ఉన్న వ్యక్తి చికిత్స కోసం స్థానిక మిలటరీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. అత్యవసర సేవల్లో భాగంగా ఆ వ్యక్తి ఇంటికి సంబంధించిన గోడను భద్రతా అధికారులు కూలగొట్టి బయటకు తీశారు. నూరుల్ హసన్ అనే 55 ఏళ్ల వ్యక్తి సాధికాబాద్ జిల్లాకు చెందినవాడు. ఇది పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది. ఆయన బరువు 330 కిలోలు.ఊబకాయ సమస్యతో బాధపడుతున్న హసన్‌ను బయటకు ఇంటిలోని ప్రధాన ద్వారం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ప్రయత్నించింది. అయితే అది సాధ్యపడలేదు. దీంతో ఇంటి గోడలను కూల్చి ఆయన్ను బయటకు తీసుకొచ్చారు భద్రతా సిబ్బంది.

Noorul Hasan

ఇక బయటపడిన తర్వాత ఆయన చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బాజ్వా. ఆయన్ను హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హసన్ తను పొందుతున్న బాధను సోషల్ మీడియాలో ఉంచడంతో అదికాస్త వైరల్ అయ్యింది. దీంతో హసన్ ప్రాణాలు కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఊబకాయ సమస్య, అధిక బరువు ఉండటం, ఇతర మెడికల్ కాంప్లికేషన్స్‌ ఉండటంతో ఆయన కదలలేక బాధపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్‌ ఉన్నందున వైద్యులు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. హసన్‌కు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ సైతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు వైద్యులు.

మంగళవారం రోజున లాహోర్‌కు తరలించారు అధికారులు. అనంతరం షాలమార్ హాస్పిటల్‌కు తరలించారు. పాకిస్తాన్‌లో అత్యంత బరువైన మనిషిగా రికార్డు క్రియేట్ చేశారు హసన్. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 2017లో భారీ బరువుతో అంటే దాదాపు 360 కేజీల బరువున్న వ్యక్తికి ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసి ఆయన బరువును 200 కిలోలకు తగ్గించారు వైద్యులు. పాకిస్తాన్‌లో 29శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది.ఇందులో 51శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారని పేర్కొంది.

English summary
Pakistan’s heaviest man, who weighs over 330 kg, has been shifted to a military hospital here after the wall of his house was broken by emergency service personnel with the help of the army.Noorul Hassan, 55, a resident of Sadiqabad district of Punjab province, some 400kms from Lahore, is suffering from extreme obesity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X