• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్ సుప్రీం అనూహ్యం -టెర్రరిస్టు ఒమర్ సయీద్ విడుదల -జర్నలిస్టు డానియెల్ హత్య కేసులో ట్విస్ట్

|

టెర్రరిస్టుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్‌లో.. ప్రభుత్వం, కోర్టులే టెర్రరిస్టులకు కొమ్ముకొస్తున్నాయని ఆరోపణలు వస్తున్నా అక్కడి పరిస్థితులు మాత్రం మారడంలేదు. పాక్ అత్యున్నత న్యాయస్థానం తాజాగా మరో కరడుగట్టిన ఉగ్రవాదికి స్వేచ్ఛ కల్పించింది. అమెరికా-పాకిస్తాన్ ల సంబంధాలను ప్రభావితం చేసే, భారత్ కు కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న ఒమర్ సయీద్ షేక్ జైలు నుంచి విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది..

చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరంచంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరం

ప్రఖ్యాత మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జనరల్ కు దక్షిణాసియా బ్యూరో చీఫ్ గా వ్యవహరించిన అమెరికా జర్నలిస్టు డానియెల్ పెర్ల్ కిడ్నాప్, హత్య కేసులో నిందితులైన ఒమర్ సయీద్ సహా మరో ముగ్గురు టెర్రరిస్టులపై ఎలాంటి చర్యలు వద్దని, వారిని తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. జర్నలిస్టు హత్య కేసులో సయీద్ సహా ముగ్గురికి విధించిన మరణశిక్షను సింధ్ హైకోర్టు రద్దు చేయగా, దానిని సవాలు చేస్తూ ఇమ్రాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు నిర్ణయం వెలువడింది.

Pak SC orders release of Omar Saeed Sheikh in Daniel Pearl murder case

బ్రిటిష్-పాకిస్తానీ జాతీయుడైన ఒమర్ సయీద్... 1999 నాటి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ ఘటనతో పాపురల్ అయ్యాడు. నాడు విమానాన్ని హైజాక్ చేసిన తాలిబన్లు.. భారత్ నుంచి విడిపించుకొని వెళ్లిన టెర్రరిస్టుల్లో ఒమర్ సయీద్ కూడా ఒకడు. ఇతని టీమ్.. 2002లో వాల్ స్ట్రీట్ జర్నలిస్టు డానియెల్ పెర్ల్ ను కిడ్నాప్ చేసి, దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో సయీద్ బృందాన్ని పాక్ పోలీసులు లాహోర్ లో అరెస్టు చేశారు. కరాచీలోని యాంటీ టెర్రరిస్టు కోర్టు వీరికి మరణశిక్షలు విధించింది. కాగా, తాము నిర్దోషులమంటూ సయీద్ సహా మరో ముగ్గురు సింధ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో..

సాగు చట్టాలపై పార్లమెంట్‌లో పోరు -బడ్జెట్ భేటీ తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ: ప్రతిపక్షాలుసాగు చట్టాలపై పార్లమెంట్‌లో పోరు -బడ్జెట్ భేటీ తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ: ప్రతిపక్షాలు

18 ఏళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత.. డానియెల్ పెర్ల్ హత్య కేసులో ఒమర్ సయీద్ పాత్ర అతి కొద్ది శాతమేనని, అతని టీమ్ సభ్యులుగా పేరున్న ఫాహద్ నసీం, షేక్ ఆదిల్, సల్మాన్ సాఖిబ్ లు పూర్తిగా నిర్దోషులని పేర్కొంటూ సింధ్ హైకోర్టు గతేడాది(2020) ఏప్రిల్ లో తీర్పు చెప్పింది. ఒమర్ సయీద్ ను సుదీర్ఘ కాలం జైలులో ఉంచడం చట్టవిరుద్దమని వ్యాఖ్యానించిన హైకోర్టు.. జర్నలిస్టు హత్య కేసులో అతనికి విధించాల్సిన 7ఏళ్ల జైలు శిక్ష ఎప్పుడో పూర్తయిపోయింది కాబట్టి వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. కాగా,

ఒమర్ సయీద్ సహా నలుగురు టెర్రరిస్టులను సింధ్ హైకోర్టు నిర్దోషులుగా తేల్చడంపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. సింధ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. 10 నెలల విచారణ అనంతరం పాక్ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. జర్నలిస్టు డానియెల్ హత్య కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కూడా సమర్థించింది. ప్రభుత్వం సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ.. ఆ నలుగురిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని జస్టిస్ ముషిర్ ఆలం బెంచ్ గురువారం ఆదేశాలిచ్చింది. అయితే, గురువారం గడువు ముగియడం, శుక్రవారం జాతీయ సెలవు దినం కావడంతో టెర్రరిస్టు ఒమర్ సయీద్, అతని అనుచరులు ముగ్గురు శనివారం జైలు నుంచి విడుదల కానున్నారు.

English summary
Pakistan’s Supreme Court on Thursday ordered the release of Omar Saeed Sheikh, one of three terrorists freed by India in 1999 in exchange for passengers of a hijacked airliner, while dismissing an appeal against the overturning of his conviction for the murder of journalist Daniel Pearl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X