వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘న్యూక్లియర్ పవర్’: భారత్‌కు పాక్ బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: తరచూ సరిహద్దులో కాల్పులకు పాల్పడుతూ శాంతి చర్చలకు విఘాతం కల్గిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు నేరుగా బెదిరింపులకు దిగుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రీజనల్ సూపర్ పవర్‌గా ఊహించుకుంటోందని పాకిస్థాన్ ప్రధాని సలహాదారు, విదేశీ వ్యవహారాలు, నేషనల్ సెక్యూరిటీ సర్తాజ్ అజీజ్ అన్నాడు.

‘భారత్ రీజనల్ సూపర్ పవర్‌గా ఊహించుకుంటోంది. అయితే మా దేశం న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశం. మమ్మల్ని ఏ విధంగా రక్షించుకోవాలో మాకు తెలుసు' అని ‘డాన్ ఆన్ లైన్'తో ఆదివారం సర్తాజ్ తెలిపాడు.

‘భారత ఏజెన్సీ ‘రా' పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందనడానికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి' అని సర్తాజ్ పేర్కొన్నాడు. ‘ఆధారాలు ఇవ్వడం కంటే పాకిస్థాన్‌కు వ్యరేతికంగా ప్రచారం చేయడమే భారతీయులకు ఇష్టం' అని చెప్పాడు.

Pak threatens India: We are a nuclear power, and know how to defend ourselves, says Sartaj Aziz

‘భారత్ వారి షరతులకు లోబడే చర్చలు జరగాలనుకుంటోంది. భారత భూభాగంలోని కాశ్మీర్‌లో 7లక్షల భారత దళాలను ఎందుకు మోహరించాయి' అని అన్నాడు. ఆక్రమిత కాశ్మీర్ అంశంపై చర్చిస్తే, ఆ ప్రాంత ప్రజల భవిష్యత్ తెలుస్తుందని అన్నాడు.

‘ప్రస్తుత పరిణామాలతో భారత ఎత్తులు పనిచేయవని తేలిపోయింది. ఇప్పుడు వారు పాకిస్థాన్ చర్చలంటున్నారు' అని తెలిపాడు. కాగా, ఉగ్రవాదంపై చర్చలు కాకుండా, కాశ్మీర్ అంశాన్ని చర్చల్లోకి తీసుకురావడంతో పాకిస్థాన్‌తో భారత్ చర్చలు రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
Adviser to the Pakistan Prime Minister on Foreign Affairs and National Security Sartaj Aziz alleged that Narendra Modi government acts as if it is a regional superpower.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X