వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల్‌భూషణ్ జాదవ్ కేసు: పాక్ వియన్నా ఒప్పందంను ఉల్లంఘించిందన్న ఐసీజే అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి తెలిపారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షుడు జడ్జీ అబ్దుల్‌ఖవి యూసఫ్ . ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఐసీజే వార్షిక నివేదికను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ఏడాది జూలై 17న కుల్‌భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించిన తీర్పును ఆయన ప్రస్తావించారు. వియన్నా నిబంధనల ప్రకారం పాకిస్తాన్ నడుచుకోవాలని కోర్టు తీర్పు చెప్పిందని అయితే పాకిస్తాన్ మాత్రం అదేమీ పట్టనట్టే వ్యవహరిస్తోందని చెప్పారు.

తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్

వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 36ను పాకిస్తాన్ ఉల్లంఘించిదని వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాలని జడ్జిమెంట్ ఉందని యూసఫ్ చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్ కుల్‌భూషణ్‌కు విధించిన మరణశిక్షపై పునఃసమీక్షించాలని కూడా చెప్పిందని యూసఫ్ గుర్తుచేశారు. అయితే పునఃసమీక్ష మాత్రం పాకిస్తాన్ పైనే ఆధారపడి ఉంటుందని తన తీర్పులో పేర్కొన్నట్లు చెప్పారు యూసఫ్. గూఢచర్యం చేశారన్న ఆరోపణలు రుజువైతే కాన్సులర్ యాక్సెస్ ఇచ్చే విషయమై ఆర్టికల్ 36లో ఉందని అయితే గూఢచర్యం ఆరోపణలు ఇంకా రుజువుకాకుండానే కుల్‌భూషణ్‌ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వలేదని యూసఫ్ చెప్పారు.

Pak violated Vienna convention in Kulbhushan case, says ICJ President

ఇక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షుడు యూసఫ్ చెప్పిన మాటలతో మరోసారి అంతర్జాతీయ వేదికలపై పాక్ పరువు పోయినట్లయ్యింది. జాదవ్‌పై తప్పుడు ప్రచారం పాక్ చేస్తోందన్న సంకేతాలు అంతర్జాతీయ సమాజానికి వెళ్లాయి. ఐసీజే కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ సెప్టెంబర్ 2న లభించింది. అయితే రెండోసారి కాన్సులర్ యాక్సెస్‌కు అనుమతి ఇచ్చేది లేదని పాక్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే జాదవ్‌ గూఢచర్యంకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పాకిస్తాన్ బలగాలు 2016 మార్చి 3న అరెస్టు చేశాయి. ఇరాన్ నుంచి పాకిస్తాన్‌లోకి జాదవ్ ప్రవేశించాడని ఆరోపణలు చేసింది పాకిస్తాన్. జాదవ్ గూఢచర్యం చేసేందుకు రాలేదని పాకిస్తాన్ అతన్ని ఇరాన్‌లోని చాబర్ పోర్టులో ఉండగా అరెస్టు చేసి తీసుకెళ్లిందని భారత్ చెబుతోంది. పోర్టు వద్ద జాదవ్ బిజినెస్ చేసుకుంటున్నాడని స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్ 11న పాకిస్తాన్ మిలటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. మే 8వ తేదీనా భారత్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది.

English summary
Pakistan violated its obligations under the Vienna Convention in the case of Indian national Kulbhushan Jadhav, International Court of Justice (ICJ) President Judge Abduylqawi Yusuf told the UN General Assembly in New York.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X