వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇళ్లపై కూలిన ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్.. 13 మంది మృతి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. దీంతో 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి గల కారణం తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పాకిస్థాన్ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.

pakistan air craft crashed at building

పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎయిర్ క్రాప్ట్ మంగళవారం ఉదయం కుప్పకూలింది. రావల్పిండిలోని భవన సముదాయంపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైలట్లు, ముగ్గురు ఆర్మీ అధికారులతోపాటు 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ క్రాప్ట్ కూలిపోవడంతో భవన సముదాయం సమీపంలోని ఆరు ఇళ్లు పూర్తిగా ధ్వసమైనట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిప్ అల్వీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధానమంత్రి ఇమ్రాన్ కాన్. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు. గాయపడ్డ క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

English summary
Army air craft crashed in Pakistan. Thirteen civilians were killed. Another 12 were injured. The cause of the aircraft's crash is unknown. Pakistani officials said in a statement that the incident was being investigated. On the other hand, the Pakistani government said it would help the families of the dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X