వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌కు ట్రంప్ ఝలక్, ఉగ్రదేశాల జాబితాలో చేర్చిన అమెరికా

పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఊహించని షాకిచ్చింది. ఉగ్రవాదంపై పాక్‌ను అంతర్జాతియంగా దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాల జాబితాలో పాకిస్తాన్‌ను కూడా చేర్చుతూ నిర్ణయం తీసుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఊహించని షాకిచ్చింది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక పాక్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అమెరికా.. తాజాగా ఆ దేశానికి గట్టి ఝలక్ ఇచ్చింది.

ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపి వేస్తామంటూ ఇప్పటికే పాకిస్తాన్ ను హెచ్చరించిన అమెరికా తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఉగ్రవాదంపై పాక్‌ను అంతర్జాతియంగా దోషిగా నిలబెట్టింది.

Pakistan among countries providing 'safe havens' to terrorists: US

ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాల జాబితాలో పాకిస్తాన్‌ను కూడా చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. 2016లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ తదితర ఉగ్రవాద సంస్థలు పాక్‌లో స్వేచ్ఛగా విహరిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ, నిధులు సేకరించాయని అమెరికా నిర్ధారించింది.

దీంతో ఉగ్రవాదులకు సేఫ్‌ హెవెన్స్‌గా భావిస్తున్న ఆప్ఘనిస్తాన్‌, సోమాలియా, ట్రాన్స్‌ సహారా, సులవేసీ సీస్‌ లిట్టోరల్‌, దక్షిణ ఫిలిప్పైన్స్‌, ఈజిప్టు, ఇరాక్‌, లెబనాన్‌, లిబియా, యెమన్‌, కొలంబియా, వెనెజువెలా సరసన తాజాగా పాకిస్తాన్‌ను కూడా చేర్చింది.

English summary
The US on Wednesday listed Pakistan among the nations and regions providing "safe havens" to terrorists+ , saying terror groups like the LeT and JeM continued to operate, train, organise and fundraise inside the country in 2016. Official sources here quickly reacted to the report and said the segments on South and Central Asia in the US state department's 'Country Report on Terrorism 2016' vindicated India's long-standing position on the menace of cross-border terrorism in the region.In its annual 'Country Report on Terrorism', as mandated by the Congress, the State Department said that Pakistani military and security forces undertook operations against groups that conducted attacks within Pakistan such as Tehrik-e-Taliban Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X