వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా : పాక్‌లో పరిస్థితి ఆగామాగం.. 60 మంది వైద్యులను లోపలేసిన ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆయుధాలు లేని యుద్దం చేస్తోంది. ప్రాణాలకు తెగించి లక్షలాది మంది డాక్టర్లు ప్రత్యక్ష యుద్దంలో పాల్గొంటున్నారు. ఇలాంటి తరుణంలో డాక్టర్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటే.. అది మానవాళికి తీవ్ర ముప్పుగా పరిణమిల్లుతుంది. కాబట్టి వైరస్‌తో యుద్దం చేస్తున్న వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం.. వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం.. ప్రపంచం ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ చాలా దేశాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రక్షణ దుస్తులు(PPE kits) కోసం వైద్యులు నిరసనలు తెలుపుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్‌లో అయితే ఏకంగా 60 మంది డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఇంత సంక్షోభ సమయంలో డాక్టర్ల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ పాకిస్తాన్ ఏం సంకేతమిస్తున్నట్టు అన్న చర్చ జరుగుతోంది.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

నైరుతి పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో పీపీఈ కిట్స్ ఇవ్వట్లేదని నిరసన తెలిపినందుకు దాదాపు 67 మంది వైద్యులను పోలీసులు సోమవారం(ఏప్రిల్ 7)న అరెస్ట్ చేశారు. నిరసనకు నేత్రుత్వం వహిస్తున్న యంగ్ డాక్టర్స్ అసోసియేషన్(YDA) ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే మరుసటిరోజు వారిని విడుదల చేయాలని ఆదేశాలు వచ్చినట్టు వైడీఏ ప్రతినిధి డా.రహీమ్ ఖాన్ బాబర్ తెలిపారు. కానీ వైద్యులు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చొన్నారు. 'నిన్న మమ్మల్ని అరెస్ట్ చేశారు.. ఇప్పటికీ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాం. విడుదల చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు.. కానీ మేము దాన్ని తిరస్కరించాం. మా డిమాండ్ల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రక్షణ దుస్తులు కావాలని మేము డిమాండ్ చేస్తే మాపై దాడి చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదేమి చట్టం..?' అంటూ అరెస్టయిన డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు.. పీపీఈ కిట్స్ కొరత

పెరుగుతున్న కేసులు.. పీపీఈ కిట్స్ కొరత


డాక్టర్ల నిరసనకు సంబంధించి సోమవారం ఒక వీడియో వెలుగుచూసింది. అందులో నిరసన తెలుపుతున్న డాక్టర్లతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అది కాస్త ఘర్షణకు దారితీసి పోలీసులు డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ అక్కడి ప్రావిన్స్ వ్యాప్తంగా అన్ని క్రిటికల్ కేర్ యూనిట్స్‌లో డాక్టర్లు నిరసనకు దిగారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ.. దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన మెడికల్ సామాగ్రిని సమకూర్చుకోవడంలో పాకిస్తాన్ సతమతమవుతోంది. అంతర్జాతీయంగా పీపీఈ కిట్స్ ఇతరత్రా మెడికల్ సామాగ్రికి డిమాండ్ పెరగడంతో.. వాటి కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ మీడియాతో వెల్లడించింది.

18మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

18మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

క్వెట్టా పాకిస్తాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైనప్పటికీ.. అక్కడి బలూచిస్తాన్ ప్రావిన్స్ సామాజికంగా,ఆర్థికంగా చాలా ఏళ్లుగా వెనుకబాటులో ఉంది. వైద్య రంగం పట్ల ప్రభుత్వ చొరవ కొరవడటంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అక్కడి వైద్య వ్యవస్థ సిద్దంగా లేదని.. ఫలితంగా ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యాలు వాపోతున్నాయి. ఇంతకుముందు ఆసుపత్రుల్లో సరిపోయేన్ని సర్జికల్ మాస్కులు,క్యాప్స్ ఉండేవని.. ఇప్పుడు అవి కూడా లేవని చెబుతున్నారు. కనీసం కరోనా వార్డుల్లో చికిత్స అందిస్తున్న డాక్టర్లకు సైతం సరైన ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో ఇప్పటివరకు 18 మంది కరోనా బారిన పడ్డట్టు చెబుతున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌ మొత్తంలో ఇప్పటివరకు 202 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒకరు మృత్యువాతపడ్డారు. 63 మంది కోలుకున్నారు.

Recommended Video

ICC Test Rankings : Virat Kohli Retains The Top Spot, Babar Azam Achieves Career Best Position
ప్రభుత్వం ఏమంటోంది..

ప్రభుత్వం ఏమంటోంది..

ఇప్పటివరకు బలూచిస్తాన్‌లో 2000 పీపీఈ కిట్స్‌,50వేల N95 మాస్కులు,32వేల సర్జికల్ మాస్కులు,1000 హెడ్ కవరింగ్స్ పంపిణీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో లోకల్ ట్రాన్స్‌మిషన్‌ కేసులు 21.4శాతంగా ఉన్నాయి. విదేశీ ట్రావెల్ హిస్టరీ లేనివారు సైతం వైరస్ బారిన పడుతున్నారు. ఇలాంటి తరుణంలో డాక్టర్లు నిరసనలకు దిగడం సరికాదని ప్రభుత్వం అంటోంది.

English summary
Police in the southwestern Pakistani city of Quetta have arrested at least 50 doctors who were protesting against the lack of personal protective equipment (PPE) kits for health workers on the front lines of the country's battle against the coronavirus, officials and doctors' union representatives said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X