వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల్ భూషణ్ కేసులో పాకిస్తాన్ బూటకం - న్యాయసహాయం అడ్డగింత - మరోసారి ఐసీజే కు భారత్..

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన భారత్ మాజీ నేవీ అధికారి కుల్ భూషన్ జాదవ్ కేసులో పాకిస్తాన్ మళ్లీ తన వంకర బుద్దిని చాటుకుంది. మరణశిక్ష ఎదుర్కొంటున్న జాదవ్ కు న్యాయసహాయం అందిచాలంటూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే) ఇచ్చిన తీర్పును పెడచెవిన పెట్టింది. భారత్ నుంచి వెళ్లిన లాయర్లు జాదవ్ తో మాట్లాడనీయకుండా అడ్డుకుంది. పాకిస్తాన్ ఆర్మీ కోర్టు జాదవ్ కు విధించిన మరణశిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఈనెల 20తో ముగిసిన నేపథ్యంలో భారత్ మరోసారి ఐజీజేను ఆశ్రయించనుంది.

పాకిస్తాన్ లో జాదవ్ కేసుకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మీడియాకు వివరించారు. ఈ కేసులో పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు బూటకాన్ని తలపిస్తోందని, దౌత్యపరమైన అనుమతులు ఇస్తామంటూనే జాదవ్ ను కలిసేందుకు వెళ్లిన లాయర్లను అడ్డుకుందని అనురాగ్ తెలిపారు.

దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..

Pakistan Blocking Legal Aid To Kulbhushan Jadhav, india to seek ICJ again: MEA

ఆర్మీ కోర్టు శిక్షను సవాలు చేస్తూ చివరి ప్రయత్నంగా ఈనెల 18న జాదవ్ తరఫున ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించామని, అయితే, పవర్ ఆఫ్ అటార్నీ, ఇతర డాక్యుమెంట్లు లేవనే సాకుతో హైకోర్టు ఆ పిటిషన్ ను నిరాకరించిందని అనురాగ్ చెప్పారు. ఏది ఏమైనా జాదవ్ ను కాపాడుకునేందుకు భారత్ తన కున్న అన్ని అవకాశాలను వాడుకుంటుందని తెలిపారు. అందులో భాగంగానే మరోసారి ఐసీజే వద్దకు వెళ్లే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Pakistan Blocking Legal Aid To Kulbhushan Jadhav, india to seek ICJ again: MEA

Recommended Video

Salman Khan Or MS Dhoni?': Kedar Jadhav Picks His Favourite Superstar

నేవీ లో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన కుల్ భూషణ్ జాదవ్.. ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటుండగా.. 2016లో పాకిస్తాన్ ఆయనపై ఉగ్రవాదం, గూఢచార్యం ఆరోపణల మోపి జైలులో బంధించింది. 2017 ఏప్రిల్ లో పాక్ ఆర్మీ కోర్టు జాదవ్ కు మరణశిక్ష విధించింది. దానిని సవాలు చేస్తూ భారత్.. 2017 మే 8న ఐసీజేలో పిటిషన్ వేసింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. జాదవ్ కు న్యాయ సహాయం అందించకుండా, ఏకపక్షంగా విచారించి శిక్షలు విధించడం వియన్నా ఒప్పందాన్ని తుంగలో తొక్కడమేనని, నాలుగ్గోడల మధ్య ఏకపక్షంగా సాగిన విచారణ ఓ ప్రహసనం అని ఐసీజే పేర్కొంది. ఆ తీర్పు మేరకు న్యాయసహాయానికి సరేనన్న పాక్.. మళ్లీ పలు విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీనిపై భారత్ మరోసారి అంతర్జాతీయ కోర్టు తలుపు తట్టనున్నది.

English summary
Ministry of External Affairs lashed out at Pakistan for not granting “unimpeded” consular access to Kulbhushan Jadhav, indicating it can knock the doors of the International Court of Justice (ICJ) at The Hague again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X