వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి పాకిస్థాన్ గగనతలంపై నిషేధాజ్ఞలు... పూర్తిగా నిలిపివేస్తామన్న పాకిస్తాన్ మంత్రి

|
Google Oneindia TeluguNews

బాలకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి తన గగనతలంపై నిషేధాజ్ఞలు విధించింది. పాకిస్థాన్‌లోని కరాచి మార్గంలో ఉన్న మూడు వైమానిక మార్గాల్లో ఈ నిషేధం కొనసాగుతోంది. అయితే నేటి నుండి ప్రారంభమైన నిషేధం ఈనెల 31వరకు కొనసాగనున్నందని పాకిస్థాన్ విమానయాన శాఖ ప్రకటించింది. మరోవైపు పూర్తిస్థాయిలో పాక్ గగనతలంపై నిషేధాని విధించే యోచనలో ఉన్నట్టు పాకిస్థాన్ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి తెలిపారు.

 కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్

కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్

రెండు దేశాల మధ్య ఏ సమస్య వచ్చిన పాకిస్థాన్ తనకున్న అన్ని మార్గాలపై దృష్టి సారిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై విజయం సాధించాలనే కోణంలో పాకిస్థాన్ ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే తనకున్న అన్ని మార్గాలను వాడుకుంటుంది. ఓ వైపు అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ఒంటరి అవుతున్న పాకిస్థాన్ భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇప్పటికే భారత్‌తో యుద్దానికి సిద్దమని ప్రకటించింది. కశ్మీరీ ప్రజల కోసం పాకిస్థాన్ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజగా వందమంది కమాండోలను కూడ ఎల్ఓసీ వద్దకు తరలించింది.

 ఆప్గానిస్థాన్‌తో వ్యాపార సంబంధాలకు బ్రేకులు వేసే కుట్ర

ఆప్గానిస్థాన్‌తో వ్యాపార సంబంధాలకు బ్రేకులు వేసే కుట్ర

మరోవైపు అఫ్గానిస్తాన్‌తో కొనసాగుతున్న వాణిజ్యానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేసేందుకు కూడ పాకిస్థాన్ మంత్రి వర్గం యోచిస్తోంది. ఇందుకోసం మంత్రివర్గం సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సాధ్యాసాధ్యాలను పరీశీలిస్తున్నట్టు ఆదేశ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి తెలిపారు. మరోవైపు పాకిస్థాన్ గగనతలంపై విమానాలను పూర్తిగా నిషేధించే యోచనలో కూడ పాకిస్థాన్ ఉన్నట్టు సమాచారం.

బాలాకోట్ దాడి తర్వాత రెండోసారి నిషేధం

బాలాకోట్ దాడి తర్వాత రెండోసారి నిషేధం

కాగా పుల్వామా దాడికి ప్రతికారంగా భారత్ జరిపిన బాలకోట్ దాడి జరిగిన తర్వాత ఫిబ్రవరి 26 నుండి జూలై 16వరకు పాకిస్థాన్ తన గగనతలాన్ని నిషేధించింది. ఈ నేపథ్యంలోనే బిష్కేక్ సదస్సుకు హజరైన ప్రధాని నరేంద్రమోడీ ఇతర మార్గం గుండా వెళ్లారు. అనేక చర్చల తర్వాత పాకిస్థాన్ తిరిగి తన గగనతలంపై నిషేధాన్ని ఎత్తివేసింది.ప్రస్థుతం రెండు దేశాల మధ్య ఉత్కంఠ నేపథ్యంలో ప్రస్తుతం తాత్కలికంగా నిషేధించిన నిషేధం, భవిష్యత్ పరిణామాలను బట్టే తిరిగి రీ ఓపేన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత విమానయాన రంగానికి కొంత నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
pakistan's Civil Aviation Authority (CAA) on Wednesday issued a notice to airmen (NOTAM), closing the three routes of Karachi airspace from August 28 to August 31,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X