వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో యుద్ధం చేస్తే ఓడిపోతాం.. కానీ: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత్‌తో యుద్ధం చేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందే ఊహించుకున్నారు. అందుకే భారత్‌తో తాము సాంప్రదాయ యుద్ధానికి దిగితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇటీవల అల్ జజీరా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.

సాంప్రదాయ యుద్ధంలో ఓడిపోవచ్చు కానీ.. అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే అది అణ్వస్త్రాలతోనే ముగుస్తుందని, అంతేగాక, భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అందుకే తాము యుద్ధం కోరుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

Pakistan could lose conventional war with India: Imran Khan

ఇంతకుముందేమో తాను కాశ్మీర్ అంబాసిడర్‌గా ఉంటానని, ప్రపంచ మొత్తం తిరుగుతానని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన ఇమ్రాన్.. భారత్‌లోని 20కోట్ల మంది ముస్లింలు తీవ్రవాదం వైపు మళ్లే అవకాశం ఉందంటూ అక్కసు వెళ్లగక్కారు.

పాక్ దేశ సచివాలయానికి వచ్చిన కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఉండి కూడా ప్రధాని ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అటు పాకిస్థాన్‌ను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించలేని ఇమ్రాన్.. భారత్ తో మాత్రం చేస్తానంటూ బీరాలు పోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కటి కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం.

English summary
Pakistan could lose in a conventional war with India which could then be consequential in view that the two neighbouring countries are nuclear-armed, country's Prime Minister Imran Khan said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X