వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడేళ్ల బాలుడి హత్య కేసులో పాక్ 'టీన్' ఉరితీత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో పాకిస్ధాన్‌కు చెందిన పెషాకత్ హుస్సేన్‌ను ఉరి తీసింది. నాలుగు వాయిదాల అనంతరం కరాచీ సెంట్రల్‌ జైలులో మంగళవారం ఉదయం అతడికి ఉరిశిక్షను అమలు చేసింది. జనవరి 14నే ఉరితీయాలనుకున్నప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

2004లో కరాచీకి చెందిన ఏడేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో షెఫాకత్ దోషిగా కోర్టు నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. నేరం చేసిన సమయానికి షెఫాకత్ వయసు 14 సంవత్సరాలు. దీంతో మైనర్ కావడం వల్ల ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని అతని తరుపు న్యాయవాదులు కోరారు.

షెఫాకత్ ఆ హత్య కావాలని చేసింది కాదని, అసంకల్పితంగా జరిగిందని కోర్టుక తెలిపారు. ఈ వాదనకు ప్రపంచ మానవ హక్కుల సంఘం కూడా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో పాక్ జువెనైల్ జస్టిస్ వ్యవస్థ ప్రకారం 18 సంవత్సరాలలోపు వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయరు.

Pakistan defies rights protests to hang 'teen' convict

దీంతో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో అతను ఆ నేరం చేయలేదని నిరూపించుకోవడంలో సరైన ఆధారాలు సమర్పించలేకపోయాడు. ఇక గతేడాది పెషావర్ పాఠశాలలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఉరిశిక్షల అమలుపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో షెఫాకత్‌కు ఉరిశిక్ష అమలు చేసింది.

గడచిన ఆరు సంవత్సరాల కాలంలో పాకిస్దాన్ 180 మందికి ఉరిశిక్షను అమలు చేసింది. రంజాన్ మాసంలో పాకిస్ధాన్ ఎలాంటి ఉరిశిక్షలను అమలు చేయదు. షెఫాకత్ కూడా రంజాన్ మాసం పూర్తైన తర్వాతే ఉరిశిక్షను అమలు చేసింది.

English summary
Pakistan on Tuesday executed a man convicted of killing a child, brushing aside a storm of protests from rights groups that his confession had been extracted by torture and he was a minor at the time of the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X