వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో మేం యుద్ధం కోరుకోవడం లేదు: పాక్ విదేశాంగ మంత్రి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ బుధవారం చెప్పాడు. అందుకే, చర్చల కోసం తాము ఆహ్వానించామని చెప్పాడు. ఈ రోజు (బుధవారం) స్ట్రైక్స్ తమ హక్కు అని చెప్పాడు. తమను తాము రక్షించుకోగలమని చెప్పాడు కానీ తాము యుద్ధం కావలని కోరుకోవడం లేదని చెప్పాడు. కాబట్టి భారత్ చర్చలకు రావాలని సూచించాడు.

భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో యుద్ధం కోరుకోవడం లేదంటూ పాకిస్తాన్ సైనికాధికారి ఆసిఫ్‌ గఫూర్‌ కూడా చెప్పాడు. సమస్యలపై ఇరు దేశాలు కలిసి చర్చిందుకుందామని పిలుపునిచ్చాడు. పాకిస్థాన్‌ బాధ్యతాయుత దేశమని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడం తమ ఉద్దేశం కాదన్నాడు. ఆత్మ రక్షణలో భాగంగానే పాక్‌ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వెంట దాడులు చేశాయన్నాడు.

Pakistan does not want war with India: Pak FM Shah Mahmood Qureshi

మరోవైపు, పాకిస్థాన్‌ సైనికులు భారత వాయుసేన వింగ్‌ కమాండర్ అభినందన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తమ భూభాగంలో కూల్చేసిన విమానం పక్కన అతని చేతులు వెనక్కి కట్టేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతను గాయపడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అభినందన్‌ను క్షేమంగా తీసుకురావాలంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. ఈ మేరకు bring abhinandan back హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

English summary
Pakistan's Foreign Minister Shah Mahmood Qureshi said on Wednesday that his country does not want a war and asked India to come to the table to resolve all outstanding issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X