వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్ గృహ నిర్బంధం పొడిగింపు

ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని మరో 30 రోజులు పొడిగించారు. అక్టోబర్ 24 తో ఆయన నిర్బంధ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ రో

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని మరో 30 రోజులు పొడిగించారు. అక్టోబర్ 24 తో ఆయన నిర్బంధ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఆ రోజు నుంచి మరో నెల రోజుల పాటు హఫీజ్‌ ఇంటికే పరిమితం కానున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌ జ్యూడిషియల్ రివ్యూ బోర్డు గురువారం నిర్ణయించింది.

హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్ ఉద్ దవా (జేయూడీ)ని విదేశీ తీవ్రవాద సంస్థగా 2014లో అమెరికా గుర్తించిన సంగతి తెలిసిందే. జేయూడీ చీఫ్ సయీద్‌ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.

Pakistan extends detention of 2008 Mumbai attacks mastermind Hafiz Saeed

కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌, అతడి నలుగురు అనుచరులను 90 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచాలని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఏడాది జనవరి 31న విధించిన ఈ గడువు తీరిన తర్వాత.. 'ప్రజా భద్రతా చట్టం' కింద వీరికి ఇప్పటివరకు రెండుసార్లు నిర్బంధాన్ని పొడిగించారు. తాజాగా హఫీజ్‌కు 30 రోజుల పాటు నిర్బంధం పొడించారు.

హఫీజ్‌తో పాటు గృహ నిర్బంధంలో ఉన్న మరో నలుగురి నిర్బంధ గడువు పొడిగించేందుకు మాత్రం బోర్డు తిరస్కరించింది. దీంతో సయీద్ అనుచరులు అబ్దుల్లా ఉబైద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహ్మాన్, ఖాజీ కాషిఫ్ హుస్సేన్‌లు స్వేచ్ఛా ప్రపంచంలోకి రానున్నారు.

English summary
Pakistan on Thursday extended the detention of the chief suspect in the 2008 Mumbai attacks for a month, government officials said. Firebrand cleric Hafiz Saeed, who heads the Jamaat-ud-Dawa (JuD) group and has a $10 million US bounty on his head, has been under house arrest since January following a government crackdown on the outfit. “Hafiz Saeed’s detention has been extended for a period of one-month,” a senior government official told AFP on condition of anonymity. He said the detention was extended by a three-member review board of Lahore high court headed by Judge Yawar Ali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X