వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముమ్మాటికి.. దావుద్ ఇబ్రహీం కరాచిలోనే ఉన్నాడు... వెంటనే మాకు అప్పగించాలి .. భారత్

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ ఉగ్రవాది దావుద్ ఇబ్రహిం పాకిస్థాన్‌లో లేడనే ప్రకటనపై భారత విదేశాంగ అధికారులు తీవ్రంగా ఖండించారు. దావుద్ ఇబ్రహిం ఖచ్చితంగా కరాచిలో ఉన్నాడని ,అందుకు సంబంధించిన సాక్ష్యాలు పలు సార్లు ఇచ్చామని విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ముంబాయి దాడుల్లో దాడుల్లో దావుద్ ఇబ్రహిం పాత్ర చాల కీలకమైందో అందరికి తెలుసని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ టెర్రరిజం అణచివేతపై ద్వంద విధానాలు అవలంబిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు.

 దావుద్ ఇబ్రహిం బహిరంగానే తిరుగుతున్నాడు

దావుద్ ఇబ్రహిం బహిరంగానే తిరుగుతున్నాడు

ఇటివల పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదుల జాబితాను భారత్ ఆ దేశానికి అందించింది. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని చాల కాలంగా డిమాండ్ చేస్తుంది..అయితే ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నామని ఈ నేపథ్యంలనే హఫీజ్ సయిద్ ఛీఫ్‌గా ఉన్న జమాత్ ఉల్ దవా సంస్థపై కూడ చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్ కోరుతున్నట్టుగా దావుద్ ఇబ్రహిం పాకిస్థాన్‌లో లేడని ఆ దేశ విదేశంగా కార్యదర్శి మహ్మద్ ఫైజల్ దావుద్ గురువారం ప్రకటించారు. దీంతో భారత్ విదేశంగా శాఖ స్పందించింది.

 పక్కగా, దావుద్ ఇబ్రహిం కరాచిలో ఉన్నాడు

పక్కగా, దావుద్ ఇబ్రహిం కరాచిలో ఉన్నాడు

దావుద్ ఇబ్రహింతో పాటు పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని భారత్ పేర్కోంది. ఈనేపథ్యంలోనే దావుద్ ఇబ్రహిం కరాచిలో ఉన్నాడనేది జగమెరిగిన సత్యమని ,కరాచిలోనే బహిరంగంగా తిరుగుతున్నట్టు తాము పదే పదే చెబుతున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ అన్నారు.కాగా పాకిస్థాన్ ఉగ్రవాదుల విషయంలో ద్వంద వైఖరి అవలంబిస్తుందని అన్నారు. ఓవైపు వారిపై చర్యలు చేపట్టామని చెబుతూనే మరోవైపు ఉగ్రవాదులు లేరని సమాధానం చెబుతుందని అన్నారు.

 పాకిస్థాన్ చర్యలతో భారత్‌ను ఫూల్ చేయలేదు.

పాకిస్థాన్ చర్యలతో భారత్‌ను ఫూల్ చేయలేదు.


ఇక అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ తన గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు నటిస్తుందని అన్నారు. అయితే నిజంగా పాకిస్థాన్ చర్యలు తీసుకుంటే ఫలితాలు ఉంటాయని , ఉగ్రవాదులపై పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజం పరిశీలిస్తుందని అన్నారు.నామమాత్రపు చర్యలతో భారత్‌ను మోసగించలేరని ఆయన అన్నారు. టెర్రరిస్టు గ్రూపులపై పాకిస్థాన్ చిత్తశుద్దితో తీసుకునే చర్యలపైనే పాకిస్థాన్ యొక్క భవితవ్వయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

English summary
India on Thursday slammed Pakistan for exhibiting double standards on its action against terror. Ministry of External Affairs spokesperson Raveesh Kumar said that while the neighbour claims to have acted against Jamat-ul-Dawa chief Hafiz Saeed, he continues to deny presence of Dawood Ibrahim on its soil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X