భారత్ పై సైబర్ యుధ్దానికి సిద్దమైన పాక్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను తయారు చేసి భారత్ మీదకు పంపించి విధ్వంసాలు సృష్టిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు సైబర్ దాడులు చెయ్యడానికి సిద్దం అయ్యిందని వెలుగు చూసింది. భారత్ ప్రభుత్వ రంగాలకు చెందిన అనేక శాఖల వెబ్ సైట్ లను హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
భారత్ మిలటరి, విదేశాంగ శాఖల వైబ్ సైట్ లను పాక్ సైబర్ హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. అదే విదంగా భారత ప్రభుత్వానికి చెందిన వివిద శాఖల వైబ్ సైట్ లను రక్షించుకోవాలని ఐబి అధికారులు సూచించారు.

పాకిస్థాన్ లోని ఐఎస్ఐ విభాగానికి చెందిన సైబర్ ఆర్మీ అనేక సార్లు సైబర్ దాడులు చేసి భారత్ కు చెందిన సమాచారం హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నించింది. పాక్ సైబర్ ఆర్మీలో 500 మందికి పైగా పని చేస్తున్నారని, వారు నిత్యం భారత్ సమాచారం హ్యాక్ చెయ్యడానికి వేచి చూస్తుంటారని వెలుగు చూసింది.
అనేక సంవత్సరాల క్రితం పాక్ సైబర్ ఆర్మీ భారత్ సీబీఐ వెబ్ సైట్ లను హ్యాక్ చేసింది. ఆ సందర్బంలో కొన్ని రోజులు సీబీఐ వెబ్ సైట్ ను బ్లాక్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో భారత్ వెబ్ సైట్ లను హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది.
సరిహద్దులలో నిత్యం పదేపదే కాల్పులు జరుపుతు భారత్ ను రెచ్చగొడుతున్న పాక్ ఇప్పుడు సైబర్ యుద్ధానికి సిద్దం అయ్యిందని వెలుగు చూడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications