వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతున్న పాక్ కుట్రలు: ఎల్ఓసీ వద్ద చొరబాట్లకు సహకారం: పసిగట్టిన నిఘా వర్గాలు..!

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ పైన విషం కక్కటంతో పాటుగా..యుద్దానికి సిద్దమని ప్రకటించిన పాకిస్థాన్ కుట్రలు కొనసాగిస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి చేస్తున్న కుట్రను భారత నిఘా సంస్థలు బయట పెట్టాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చొరబాట్లకు పాక్ సైన్యం ఉగ్రవాదులను భారీగా భారత్ లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద 31 ప్రాంతాల్లో ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం చొరబాట్లకు సహకరిస్తోందని పసి గట్టారు. కాశ్మీర్ లోని పౌరులను అడ్డు పెట్టుకొని ఉగ్ర మూకలను భారతలోకి చొప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిని పసి గట్టిన నిఘా వర్గాలు భద్రతా దళాలను అప్రమత్తం చేసాయి.

లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ కుట్ర
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్థాన్ మరింతగా కుట్రలకు తెగబడుతోంది. ఏకంగా వాస్తవాధీన రేఖ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులను చొప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఐక్యరాజ్య సమమి సమావేశాలు ముగిసిన తరువాత ఉగ్రవాదులను భారత్ లోకి పంపేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పసి గట్టాయి. ఇందు కోసం వాస్తవాధీన రేఖ వద్ద 31 ప్రాంతాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తేల్చాయి.

Pakistan has planned a massive infiltration attempt to push heavily-armed terrorists into India

అందు కోసం అక్కడ ఉన్న సాధారణ పౌరులను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. ఉగ్రవాది హఫీజ సయిదీ నాయకత్వంలో జమాత్ ఉల్ అల్ హదీస్ సంస్థ దాదాపు మూడు వేల నుండి నాలుగు వేల వరకు యువతకు ఉగ్ర శిక్షణ ఇస్తోంది. వాస్తవాధీన రేఖను దాటి ముందుకు వెళ్లేందుకు వారికి తర్ఫీదు ఇస్తున్నారు. జేకేఎల్ఎఫ్ యువత, పీఓకేలో క్రియాశీలకంగా ఉన్న యువతను సైతం తమ వైపు తిప్పుకొని ...వారిని భారత్ మీదకు ఉసి గొల్పేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

వాస్తవాధీన రేఖ దాటి పంపటమే లక్ష్యం..
వీరందరికీ శిక్షణ ఇచ్చి వాస్తవాధీన రేఖ దాటి భారత్ లోకి పంపేలా ప్రయత్నాలు చేస్తోంది. వీరిని భారత సైన్యం అడ్డుకొని కఠినంగా వ్యవహరిస్తే భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పండిదని భారత్ మీద ఆరోపణలు చేయటం మరో వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఉగ్ర మూకలు వాస్తవాధీన రేఖ దాటేందుకు సహకారం అందించేందుకు పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీంలను సైతం మొహరిస్తోంది. అక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటే సమయంలో భారత బలగాల ఫోకస్ వారి మీద లేకుండా వీరు ప్రయత్నాలు చేయటానికి సిద్దం అవుతున్నట్లు గుర్తించారు.

ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ 'కాశ్మీర్'పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలుఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ 'కాశ్మీర్'పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలు

పాకిస్థాన్ ఉగ్రవాదులను తమ సైన్యం బంకర్లలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోంటోంది. ఉగ్రవాదుల సహకారంతోనే పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం లను సిద్దం చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో భారత బలగాలను పక్క దోవ పట్టించేలా పాక్ సైన్యం వాస్తవాధీన రేఖ వెంబటి ఒప్పందాలను ఉల్లంఘించి కాల్పులకు పాల్పడటం కూడా వ్యూహంలో ఒక భాగంగా గుర్తించారు. నిఘా సంస్థలు అందించిన ఈ సమాచారంతో భారత సైనికాధురులు అప్రమత్తం అయ్యారు. పాకిస్థాన్ సైన్యం.. ఉగ్రవాదులకు అందిస్తున్న సహకారం..వాస్తవాధీన రేఖ వెంబటి చొరబాట్ల ప్రయత్నం పైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసారు.

English summary
Pakistan has planned a massive infiltration attempt to push heavily-armed terrorists into India. Intelligence agencies have received inputs that after UNGA in the United States gets over, Pakistani Army and terrorists are planning to violate 31 places along the Line of Control to enter Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X