వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లేట్, గ్లాస్ తెచ్చుకో: పాక్‌లో హిందూ రిపోర్టర్‌పై వివక్ష

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్థాన్‌లో మతపరమైన వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇటీవల హిందూ మతానికి చెందిన ఓ వృద్ధుడిపై ఓ కానిస్టేబుల్, అతడి సోదరుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. సాయంత్రం రంజాన్ ఉపవాస దీక్ష ముగియడానికి ముందే ఓ దుకాణదారు గోకుల్ దాస్(80) అరటిపండు తింటూ అలీ అనే కానిస్టేబుల్‌కు కనిపించాడు. దీంతో ఆ కానిస్టేబుల్, అతడి సోదరుడు ఆ వృద్ధుడ్ని తీవ్రంగా కొట్టారు.

అక్కడికి చేరుకున్న కొందరు వృద్ధుడ్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులిద్దర్నీ అరెస్ట్ చేశారు. కాగా, తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. హిందూ మతానికి చెందిన ఓ పత్రికా విలేకరి పట్ల సహచర ఉద్యోగులే వివక్ష ప్రదర్శించారు. ఎన్నాళ్లుగానో తమతోపాటే కలిసి పనిచేస్తున్న వ్యక్త్తి.. హిందువని తెలియడంతో అతడు తమతో కలిసి భోజనం చేయడానికి వీల్లేదంటూ దూరం పెట్టారు.

Pakistan: Hindu journalist forced to drink from separate glass at office

సొంత గ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఆదేశించారు. సాక్షాత్తూ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ఏఏపీ)కు చెందిన విలేకరి సాహిబ్‌ ఖాన్‌ ఓద్‌‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. తొలుత ఇస్లామాబాద్‌లో నియమితుడైన ఓద్‌.. ఆ తర్వాత హైదరాబాద్‌కు, ఈ ఏడాది ఏప్రిల్‌లో కరాచీకి బదిలీ అయ్యారు.

సాహిబ్‌ఖాన్‌ హిందువనే విషయం తెలిసిన తర్వాత సహోద్యోగులు అతనిని దూరం పెట్టారు. అంతేగాక.. ఆఫీసులో భోజనం చేయాలనుకుంటే సొంత గ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఏఏపీ బ్యూరో చీఫ్‌ పర్వేజ్‌ అస్లాం ఆదేశించాడు.
హిందువునని తెలియడంతో వివక్ష ప్రదర్శిస్తున్నారని ఓద్‌ మీడియాకు తెలిపాడు.

కాగా, ఈ ఆరోపణలను అస్లాం ఖండించారు. ఓద్‌ జ్వరంతో బాధపడుతున్నందునే సొంత గ్లాసు, ప్లేటు తెచ్చుకోవాలని చెప్పామని వివరించారు. బదిలీ చేయడం వల్లే అతను ఈ ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు. అయితే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, వివక్షకు గురిచేసినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

English summary
A Hindu reporter in Pakistan’s state-run news agency has been barred from drinking water in the same glass and sharing utensils with other Muslim staff at the office after his colleagues found out his religion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X